Viral Video : అమ్మాయిలు అంటేనే సున్నితంగా ఉంటారు. మృదువుగా కనిపిస్తారు. ముట్టుకుంటే కందిపోయేలా ఉంటుంది శరీరం. ఇక పెళ్లి కూతురు అంటే.. మరింత అందంగా ముస్తాబవుతారు. పెళ్లి కూతురు అనగానే పట్టుచీరలో నింనడైన తెలుగదనం ఉట్టిపడేలా సిగ్గు పడుతూ ఉండే రూపం గుర్తొస్తుంది. కానీ, ఇక్కడ ఓ అమ్మాయి భారీ కండలతో పెళ్లి కూతరుగా ముస్తాబైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. సంప్రదాయ కంజివరం చీరలో ఆమె పెళ్లి కూతరుగా ముస్తాబైంది. నగుల పెట్టుకుని బాడీ బిల్డర్‌గా ఫోజులు ఇచ్చింది. ఇందులో కనిపిస్తున్న ఆ యువతిపేరు చిత్ర. ఓ ఫిట్‌నెస్ ట్రైనర్(Fitness Trainer). అందుకే ఇలా పెళ్లి కూతురు దుస్తులోనూ తన ఫిట్‌నెస్ ప్రదర్శించింది. ఎంతో గర్వంగా తన అందాన్ని, కండలను చూపెడుతూ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Also Read : బ్రేక్ డ్యాన్సులతో అదరగొట్టిన అర్చకులు.. వీడియో వైరల్!
స్పందిస్తున్న నెటిజన్లు..
కండల పెళ్లి కూతురు వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. పెళ్లి వేడుకలకు నగలు పెట్టుకుని రెడీ అవడం సాధారణమే కానీ, ఇలా కండలు ప్రదర్శించడం ఏంటి అని కొందరు. మీ కండలు చూస్తే పెళ్లి కొడుకు పీటల మీది నుంచి పారిపోతాడు అని కొందరు కామెంట్‌చేశారు. కొందరు కండల ప్రదర్వన ద్వారా తన ఆత్మవిశ్వాసాన్ని చిత్ర ప్రదర్శిస్తోందని కొందరు కామెంట్ చేశారు. పెళ్లి కూతురు ముస్తాబు ఎలా అవ్వాలో ఈమెను చూసి నేర్చుకోవాలి అని ఓ నెటిజన్ సూచించాడు. ఇది ట్రెండింగ్ మేకప్ స్టైల్‌గా మారుతుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. కొందరేమో లేడీ బాహుబలి సూపర్ అని అభినందిస్తున్నారు.
Also Read : శతమానం భవతి సినిమాను రియల్ లైఫ్ లో చూపించాడు.. ఆ తండ్రి ఆనందానికి అవధులు లేవు.. వైరల్ వీడియో