Viral video : ఇలా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటారు కాబట్టే ప్రపంచంలో భారతీయులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అక్కడిదాకా ఎందుకు అమెరికాలో మన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. చైనీయుల తర్వాత అమెరికాలో అధికంగా ఉండేది మనవాళ్లే. మనవాళ్లు ఎక్కువగా పొదుపు చేస్తుంటారు. ఎక్కువగా పని చేస్తుంటారు. అమెరికన్లు మాత్రం వారంలో ఐదు రోజులు పనిచేసి.. శని, ఆదివారాల్లో ఆ ఐదు రోజులు సంపాదించినది మొత్తం ఖర్చు పెట్టేస్తుంటారు. అయితే అమెరికన్లు ఇప్పుడు ఆ స్థాయిలో ఖర్చు చేయడం లేదట. జీవితాన్ని మరి అత్యంత విలాసంగా గడపడం లేదంట. దీనికి కారణం భారతీయులు మాత్రమే నట. ఎందుకంటే తాగే నీరు నుంచి పడుకునే పడకదాకా ప్రతి విషయంలోనూ భారతీయులు పొదుపును.. భవిష్యత్తును అంచనా వేస్తూ సాగుతుండడంతో.. అమెరికన్లు కూడా అలానే ఆలోచిస్తున్నారట. అందువల్లే ఇటీవలి కాలంలో అమెరికన్లలో పొదుపు పెరిగిందట. భవిష్యత్తు గురించి వారు కూడా దీర్ఘంగా ఆలోచిస్తున్నారట.. పెట్టుబడులు, స్టాక్స్.. రియల్ ఎస్టేట్ మాత్రమే కాకుండా తినే తిండి.. తాగే నీరు.. కుటుంబం.. ఖర్చులు వంటి వాటి విషయాల్లో సగటు అమెరికన్ వ్యవహార శైలి పూర్తిగా మారిందట.
ఏదీ ఉట్టిగ ఎందుకు పోనిస్తారు..
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో భారతీయుల శైలికి అద్దం పడుతోంది. సాధారణంగా ఏ వస్తువును కూడా భారతీయులు ఉట్టిగానే పోనివ్వరు. దానిని ఉపయోగించిన దానికంటే ఎక్కువగా వాడుతుంటారు. అందువల్లే భారతీయులు ప్రపంచ దేశాలలో భిన్నంగా నిలుస్తున్నారు. ఉదాహరణకు మన ఇంట్లో దంతాలు తోముకునే పేస్ట్ అయిపోతే.. చివరికి దానిని కట్ చేసి.. అందులో ఉన్న అరకొర పేస్టు కూడా వాడుతుంటారు. బహుశా ఇటువంటి వాడక ప్రపంచంలో ఎక్కడా కనిపించి ఉండదు. అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియోలో.. నీటి పైపులైను పలిగింది. అది ఎందుకు పగిలిందో.. ఎలా పగిలిందో తెలియదు. నీరు మాత్రం పైప్ లైన్ నుంచి భారీగా రావడం మొదలుపెట్టింది. అయితే ఆ పైపులైన్ కు సంబంధిత అధికారులు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో నీరు వృధాగా పోతున్న నేపథ్యంలో కొంతమంది వాహనదారులు తమకార్లను ఆ నీటి కింద కడుక్కోవడం మొదలుపెట్టారు. ఒకరితో మొదలైన ఈ వ్యవహారం.. చాలామంది దాకా వెళ్ళింది. చాలామంది తమ కారుతో అక్కడికి రావడం.. ఆ నీటి కింద దానిని పెట్టడం.. శుభ్రమైన తర్వాత వెళ్లిపోవడం.. ఇలా నిరాటంకంగా అక్కడ జరిగింది. అయితే ఈ వ్యవహారాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన ఫోన్లో వీడియో రికార్డ్ చేశాడు . ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సంచలనంగా మారింది. అన్నట్టు ఆ వీడియోకు అతడు మేము భారతీయులం.. దీనిని కూడా వృధాగా పోనీయం అని కామెంట్ చేశాడు. దానికి తగ్గట్టుగానే అతడు ఆ కామెంట్ చేయడంతో.. చాలామందికి నచ్చింది. అందువల్లే లక్షలలో వ్యూస్ సొంతం చేసుకుంది.