Water From Tree: ప్రకృతిలో వింతలు, విశేషాలు ఇమిడి ఉంటాయి. అవి మన కంట కనపడవు. ఇలాంటివి ఒకప్పుడు డిస్కవరీ చానెల్స్ లో మాత్రమే చూసేవాళ్లం. కానీ మొబైల్ వచ్చాక ప్రతీ విషయం తెలిసిపోతుంది. ఎక్కడ ఏ అద్భుతం జరిగినా ఒక్కసారి మొబైల్ లోకి వచ్చిందంటే చాలు కొన్ని గంటల్లో ప్రపంచమంతా చేరిపోతుంది. ఇలాంటి వింత ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఎక్కడో జరిగింది కాదు.. మన తెలుగు రాష్ట్రాల్లోనే.. అదీ ఆంధప్రదేశ్ లోని అల్లూరి జిల్లాలో.. ఇంతకీ అసలు విషయమేంటంటే?
భూమిపై మూడోంతుల నీరు ఉంటుందని పుస్తకాల్లో చదివే ఉంటాం. కానీ కొన్ని ప్రదేశాల్లో భూమి ఉన్నా నీరు అలుముకొని ఉంటుంది. ఒక్కోసారి ఇది ఉబికి వస్తుంటుంది. ఇలా బావుల్లో, బోరు నీళ్లలోనుంచి నీరు పైకి వస్తాయి. కానీ ఇక్కడ చెట్టు నుంచి నీరు కారుతోంది. చెట్టు పూలు, కాయలు మాత్రమే కాదు.. నీళ్లు కూడా ఇస్తుందని కొందరు చెబుతుంటే ఫేక్ అనుకున్నారు. కానీ ఇక్కడ వీడియోతో సహా చూపించి నిరూపించారు.
ఏపీలోని అల్లూరి జిల్లా రంపచోడవరం -కింటుకూరు అటవీ ప్రాంతంలో నల్ల మద్ది చెట్టు ఉంది. దీని నుంచి నీరు నిరంతరాయంగా పంపు వలె బయటకు వస్తోంది. ఈ ప్రదేశంలో వేలాదిగా నల్లమద్ది చెట్లు ఉననాయి. ఈ చెట్లు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. ఒక్కో చెట్టు 20 లీటర్ల నీరును నిల్వ చేసుకొని ఉంటుంది. అలా ఓ చెట్టు నుంచి నీరు పంపు వలె బయటకు వచ్చే విషయాన్ిన ఫారెస్ట్ అధికారులు గుర్తించి దానికి సంబంధించిన వీడియో బయటకు వదిలారు. ప్రస్తుతం అది వైరల్ గా మారింది.
అటవీ ప్రాంతంలో కనిపించిన అరుదైన జల ధార వృక్షం
పాపికొండల నేషనల్ కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులను కనివిప్పు చేసిన నల్లమద్ది చెట్టు.
నల్లమద్ది చెట్టు నుండి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అధికారులు వెల్లడి. pic.twitter.com/5C7qmYB6an
— Telugu Scribe (@TeluguScribe) March 30, 2024