Husband and Wife: భార్యభర్తల బంధం చాలా గొప్పది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. పెద్దల కుదిర్చిన అమ్మాయితో పెళ్లి చేసుకున్నా అమ్మాయి మాత్రం అత్తవారింటికి రావాల్సిందే. మెడలో తాళి కట్టగానే ఒక వ్యక్తిని తన భర్త అనుకొని ఇక ప్రపంచం తానే అనుకొని మెట్టింట్లో కాలు పెడుతుంది ఆ మహిళ. కొంత మంది జీవితం మెట్టింట్లో బాగుంటే.. కొందరి జీవితం మాత్రం నరకంగా మారుతుంది. అర్థం చేసుకోలేని భర్త, పెత్తనం చెలాయించే అత్త, తాగుబోతు మామ, కంచుల్లా ఆడపడుచులా ఇలా ఒక్కక్కరికి ఒక్కో సమస్య.
సమస్యలు ఎన్ని ఉన్నా భర్త సపోర్ట్ ఉంటే ఆమె జీవితం అందంగా అనిపిస్తుంది. లేదంటే కుంపటిలో వేసిన మాదిరి అవుతుంది. ఇక పుట్టింటి నుంచి రావాల్సిన కట్న కానుకలు తక్కువ అయినా, లేద కాస్త మర్యాద తక్కువ అయిన లేదా చెప్పుడు మాటలు విన్నా కూడా భర్త నుంచి భార్యకు టార్చర్ ఉంటుంది. ఇలాంటి వేదనలు ఎదర్కొనే మహిళలు చాలా మంది ఉన్నారు. అయితే కొందరు భర్తలు ఏకంగా పుట్టింటికి వెళ్లవద్దు అనే కండీషన్ పెడుతారు. చెల్లెతి మాట్లాడవద్దు, అక్కను కలవద్దు, తమ్ముడికి రాఖీ కట్టవద్దు అంటూ ఎన్నో అడ్డంకులు చెబుతారు.
20 సంవత్సరాలు కనిపెంచిన ఆ కుటుంబానికి దూరం అవ్వాలని చెప్పడం ఎంత వరకు కరెక్ట్. అందరిని వదిలి వచ్చిన మీ భార్యను పుట్టింటిని మొత్తానికే వదిలేయు అనడం ఎంత వరకు సమంజసం. ఎన్ని కష్టాలు వచ్చిన తోడుంటాను అని ఒట్టు వేసిన బంధం కన్నవారిని కూడా వద్దు అనడం సరైనదా? రంగుల ప్రపంచంలా ఉంటుంది అనుకునే ఆమె జీవితం నల్లని రంగు తప్పా మరొకటి కనిపించకుండా చేయడం మంచిదా? ఇల్లాలి ఏడుపు ఇంటికి మంచిదా అని ఒకసారి ఆలోచిస్తే సమస్యలు ఉండవు.
సమస్యలు, గొడవలు, చికాకులు ఎవరి మధ్యనైనా ఉంటాయి. కానీ వాటిని పరిష్కరించుకొని కలిసి పోవాలి కానీ బంధాలను దూరం చేస్తే దగ్గర అవడం కష్టమే. చిన్న చిన్న తప్పులను క్షమిస్తూ పోతేనే మానవ జన్మకు అర్థం అంటారు పెద్దలు. మరి గొడవలు పెంచుకుంటూ మీ భార్యను ఏడిపిస్తారా? అర్థం చేసుకొని అందరూ కలిసిపోయి కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారా అనేది మీ చేతుల్లోనే ఉంది. ఆలోచించండి.