https://oktelugu.com/

Viral Video : ప్రపంచంలో అత్యుత్తమ భర్త ఇతడే: వైరల్ వీడియో

Viral Video : సమయస్పూర్తి.. ఇది ఉన్నవారు ఏ తప్పు చేసినా బయటపడరు. దానిని ప్రతి సందర్భంలో పాటించిన వారు ఎవరికీ దొరకరు. కాకపోతే ఇది అందరిలోనూ ఉండదు. ఉన్నవారిలో ఎదుగుదలకు అడ్డు ఉండదు.

Written By: , Updated On : March 20, 2025 / 09:01 PM IST
Best Husband

Best Husband

Follow us on

Viral Video : మనదేశంలో భర్తలపై భార్యలు చేసే ప్రధాన ఆరోపణలు మాత్రం.. భర్త తాగి వస్తాడని.. ఫ్రెండ్స్ తో పార్టీలకు వెళ్తాడని.. అక్కడ మద్యం తాగినా.. ఇంటికి వచ్చేసరికి తాగినట్టు ఉంటాడని.. మద్యం తాగి ఇంటికి వచ్చినప్పుడు వాసన రాకుండా ఉండడానికి ఏదో ఒకటి చేస్తాడని.. కానీ ఎంత తాగి వచ్చినప్పటికీ.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. చివరికి ఏదో ఒక సందర్భంలో భర్తలు భార్యలకు దొరికిపోతూనే ఉంటారు. ఈ జాబితాలో కొందరు మినహా మిగతా అందరూ తాగినప్పుడు దానిని దాచుకోలేరు. ఏదో ఒక పాయింట్ లో బయటపడి పోతారు. ఇక ఆ సందర్భంలో భార్యలు తిట్టే తిట్లు.. పెనం మీద పొంగే అట్ల కంటే వేడిగా ఉంటాయి.. ఆ సందర్భంలో పొరపాటున భర్త కనక ఎదురు ప్రశ్నిస్తే అప్పుడు ఉంటుంది నా సామి రంగా.. భార్యలు దెబ్బకు శివతాండవం చేస్తారు. అమ్మోరు లాగా విజృంభిస్తారు.

Also Read : దండం రా దూత.. డబ్బులు ఇలా కూడా లెక్క పెడతారా? వైరల్ వీడియో

ఇతడు మాత్రం పూర్తి డిఫరెంట్

సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలో ఓ భర్త పీకల దాకా తాగినప్పటికీ తన సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. మామూలుగా కాదు .. ఆ వీడియో ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం.. ఓ బార్ లో తన స్నేహితులతో కలిసి ఓ వ్యక్తి పీకల దాకా మద్యం తాగుతాడు. అతడు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అతని భార్య బార్ దాకా వస్తుంది. ఆమె రాకను ముందుగానే అతడికి కొంతమంది చెబుతారు. వెంటనే అతడు బార్ వెయిటర్ వేషం వేస్తాడు. వచ్చిన వాళ్లందరికీ మద్యం, ఇతర స్టఫ్ సరఫరా చేస్తుంటాడు. సరిగ్గా భార్య వచ్చిన సమయానికి బార్ లో అతడు ఎదురుపడతాడు. అతడిని చూసిన భార్య ఒక సారిగా షాక్ కు గురవుతుంది. “నువ్వు.. బ్యాంకులో పని చేస్తున్నావ్ కదా.. ఇక్కడ ఈ వేషం ఏంటి” అని ప్రశ్నిస్తుంది. దానికి అతడు ” నేను పగలు మొత్తం బ్యాంకులో పని చేస్తున్నాను. రాత్రి మొత్తం బార్లో పనిచేస్తున్నాను. ఇలా వచ్చిన ఆదాయంతో నీకు నగలు, చీరలు కొనిస్తున్నాను. నీ క్షేమం కోసమే నేను తాపత్రయపడుతున్నాను. నీ ఆనందం కోసమే కష్టపడుతున్నాను” అని అతడు చెప్పగానే.. ఆ భార్య వెంటనే కౌగిలించుకుంటుంది. నేనంటే నీకు ఎంత ప్రేమ అని మురిసిపోతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతడు మాత్రం అలా వెళ్ళిపోగానే బార్ వెండర్ వేషం తీసివేసి.. ఫ్రెండ్స్ తో మందు కొడుతుంటాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అతడికి ఉన్న సమస్పూర్తిని చూసి మెచ్చుకుంటున్నారు. భర్త అంటే ఇలా ఉండాలని.. ఇలాంటి భర్తలు నూటికో కోటికో ఒకరు ఉంటారని వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read : సలసల కాగే నూనెలో చేతులతో అదేం పని రా బాబూ.. వైరల్ వీడియో