Suriya
Suriya: సూర్య నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా హీరో సూర్య మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్స్ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను ఫైనల్ చేశారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన రెట్రో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. ఇక ఈ సినిమాలో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రెట్రో సినిమా మే 1, 2025న రిలీజ్ కానుంది. ఇక రెట్రో సినిమా తర్వాత సూర్య తన 45వ సినిమాలో నటిస్తున్నారు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో సూర్య 45వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాలో సూర్యకు జోడిగా త్రిష నటిస్తుంది. సూర్య మరియు త్రిష ఇద్దరు కూడా ఈ సినిమాలో న్యాయవాదులుగా కనిపించబోతున్నారు. ఆసక్తికరమైన కథతో ఆర్జే బాలాజీ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Aslo Read: విశ్వంభర సినిమాలో త్రిష కు పోటీగా మరో స్టార్ హీరోయిన్
అలాగే ఇక ఈ సినిమా తర్వాత సూర్య తమిళ సినిమా వాడి వాసల్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. లక్కీ భాస్కర్, సార్ వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో కూడా సూర్య ఒక సినిమా చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన రావలసి ఉంది. ఇప్పటికే ఈ సినిమా గురించి కోలీవుడ్ సినీ వర్గాల్లో ఆసక్తికర టాక్ వినిపిస్తుంది. ఇంకా అధికారికంగా అనౌన్స్ కానీ ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి కూడా ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో నటి మమిత బైజు ఒక ప్రధాన పాత్రలో నటించబోతున్నారు అని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
Aslo Read: నితిన్ ‘ఎల్లమ్మ’ నుండి సాయి పల్లవి అవుట్..కారణం ఏమిటంటే!
ఇక గతంలో కూడా వీరిద్దరూ బాల దర్శకత్వం వహించిన వనం గాన్ సినిమాలో నటించారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల హీరో సూర్య మరియు మమిత ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక ఆ తర్వాత ఆ సినిమాలో అరుణ్ విజయ్ మరియు రీత నటించారని చెప్తున్నారు. ఇక ఈ క్రమంలో దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించబోతున్న సినిమా లో మమత బైజు ప్రధాన పాత్రలో కనిపించబోతుంది అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే క్లారిటీ రానుంది. ఇటీవలే ఈ అమ్మడు ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది.