spot_img
Homeవింతలు-విశేషాలుEagle Snake fight video Lions entry: గద్దను, పాము చుట్టేసింది.. సడన్ గా సింహాల...

Eagle Snake fight video Lions entry: గద్దను, పాము చుట్టేసింది.. సడన్ గా సింహాల ఎంట్రీ.. అడవి మొత్తం దద్దరిల్లింది.. మామూలు వీడియో కాదిదీ

Eagle Snake fight video Lions entry: ఆ గద్ద అడవి మొత్తం తిరిగింది. వేటాడేందుకు ఒక్క జంతువు కూడా దొరకలేదు. అలసిపోయి. ఒక రాయి మీద కూర్చుంది. దాని వెనకాల ఒక తాచు పాము వచ్చేసింది. ఆ గద్దను అమాంతం పట్టుకుంది. దానిని మింగేయడానికి ప్రయత్నించింది. కానీ ఆ గద్ద పెద్దదిగా ఉండడంతో పాము ఆటలు సాగలేదు..

పాము అమాంతం ఆ గద్దను పట్టేసుకుని రాయి నుంచి కిందకు దూకింది. గద్దను కాటు వేయడానికి అనేకసార్లు ప్రయత్నించింది. గద్ద చాకచక్యంగా తప్పించుకుంది. అయినప్పటికీ గద్ద కాళ్లను పాము పట్టేసుకుంది. పామును విడిపించుకోవడానికి గద్ద.. గద్దను తినేయడానికి పాము.. ఇలా ఆ రెండు జంతువుల మధ్య పెనుగులాట జరుగుతోంది. ఇంతలోనే సింహాల బృందం అక్కడికి వచ్చింది. ఆ పామును చూడగానే ఓ సింహంలో ఆకలి కలిగింది. వెంటనే ఆ పామును తినేయడానికి వచ్చింది.. ఆ పాము మీద దాడి చేసింది. ఆ పామును సింహం నోటితో లాగింది. ఈలోగానే ఆ గద్ద బయటపడింది.. బతుకు జీవుడా అనుకుంటూ రెక్కలను ఆడించుకుంటూ ఎగిరిపోయింది.

ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. కాకపోతే ఈ దృశ్యాలను నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ప్రసారం చేసింది.. గద్ద, పాము, సింహం మధ్య జరిగిన పోరాటం అడవిని మొత్తం దద్దరిల్లే విధంగా చేసింది. సింహం, పాము, గద్ద ఇలా భిన్నమైన జంతువుల మధ్య జరిగిన పోరాటం వింతగా ఉందని చూసిన వాళ్ళు చెబుతున్నారు.. అడవుల్లో ఈ తరహా పోరాటాలు అరుదుగా జరుగుతాయి.. అయితే నేషనల్ జియోగ్రాఫిక్ ప్రతినిధులు చాలాసేపు ఎదురుచూసిన తర్వాత ఈ పోరాటం వారికి కనిపించింది.. దీనిని అత్యంత జాగ్రత్తగా వారు తమ కెమెరాలలో బంధించారు.

“అంతటి నల్ల తాచుపాము గద్దను చుట్టేసుకుంది. గద్ద పామును గమనించలేదా.. లేదా పాము చాకచక్యంగా పట్టేసుకుందా.. తెలియదు గాని ఈ దృశ్యాలు చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఈ దృశ్యాలను లైవ్ లో చూస్తున్నవారు ఎలా ఉన్నారో తెలియదు.. కానీ ఇటువంటి సన్నివేశాలు చూడడం ఇదే తొలిసారి అని” నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper
Exit mobile version