Viral Video: ఇక ఇటీవల కాలంలో కోతుల బెడద చాలా పెరిగిపోయింది. పంట చేలు సర్వనాశనం అవుతున్నాయి. గ్రామాల్లో కూడా కోతుల బీభత్సం పెరిగిపోవడంతో ఏం చేయాలో పాలు పోవడం లేదని ప్రజలు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కోతుల బెడద నివారణ ప్రధాన అస్త్రంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు కోతుల బెడదను తగ్గిస్తామని.. అప్పుడే తమకు ఓటు వేయాలని ఓటర్లను కోరుతుండడం విశేషం. కొండలు, గుట్టలను తొలచి వేయడం.. ఇష్టానుసారంగా చెట్లను నరకడం వల్ల పర్యావరణం సర్వనాశనం అవుతోంది. దీంతో కోతులకు నిలువ నీడ లేకుండా పోతోంది.. ఈ క్రమంలో ఆహారం కోసం కోతులు గ్రామాల మీద పడుతున్నాయి. పంటచేలను సర్వనాశనం చేస్తున్నాయి. ఇక ఇంట్లో పెంచుకున్న పండ్ల మొక్కలను.. ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలను తినేస్తున్నాయి. అడ్డగించిన మనుషులపై దాడులు చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. అందువల్లే చాలామంది కోతులు అంటేనే భయపడిపోతున్నారు. కోతుల జాడ కనిపిస్తేనే వెనకడుగు వేస్తున్నారు.
Also Read: అదిరిపోయేలా ఐపీఎల్ ఆరంభ వేడుకలు.. ఈసారి ప్రదర్శన ఇచ్చేది ఎవరంటే?
ఫోన్ ఎత్తుకుపోయింది
కోతుల సమస్య కేవలం తెలంగాణలోనే కాదు, దేశం మొత్తం మీద ఉంది. అడవుల సంఖ్య తగ్గిపోవడం.. గుట్టలు, కొండలు గ్రానైట్ క్వారీలుగా మారిపోవడంతో.. కోతులకు నిలువ నీడ లేకుండా పోతోంది. ఆహారం లభించే మార్గం మూసుకుపోతోంది. దీంతో కోతులు గ్రామాల మీద పడుతున్నాయి. అయితే పర్యాటక ప్రాంతాలకు కూడా కోతుల బెడద తప్పడం లేదు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వృందావన్ లో ఓ కోతి ఓ యువకుడి ఫోన్ ఎత్తుకు పోయింది. దాని విలువ దాదాపు 50 వేల వరకు ఉంటుంది. దీంతో అతడు తన ఫోన్ కోసం అనేక ఇబ్బందులు పడ్డాడు. కోతిని బతిమిలాడాడు. కోతిని అనుసరించా. చివరికి ఓ ఫ్రూటీ ప్యాకెట్ ఇవ్వడంతో కోతి కనుకరించింది. ఫ్రూటీ ప్యాకెట్ అందుకోవడమే ఆలస్యం.. ఆ వినియోగదారుడు ఫోన్ చేతికి అందించింది. దీనికి సంబంధించిన వీడియోను కొంతమంది తమ చరవాణిలలో వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో అందుబాటులో ఉంచారు. దీంతో ఆ వీడియో కాస్త ఒకసారిగా వైరల్ గా మారింది. ఇప్పటికైనా మనుషులు మారాలని.. కోతుల ఆవాసాలను అలాగే వదిలిపెట్టాలని.. అప్పుడే అవి బతకనిస్తాయని.. లేకపోతే ఇలానే ఇబ్బందులు పెడతాయని నెటిజన్లు పేర్కొంటున్నారు. అన్నట్టు ఫ్రూటీ జ్యూస్ ప్యాకెట్ తీసుకున్న తర్వాత ఆ కోతి అక్కడ నుంచి వెళ్లిపోవడం విశేషం. ఫోన్ అందుకున్న ఆ వినియోగదారుడు రెండో మాటకు తావులేకుండా.. వెనక్కి తిరిగి చూడకుండా అతడు వెంటనే అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు.
Monkey Steals Samsung S25 Ultra in Vrindavan, Returns It For Mango Drink- #Watch #Monkey #SamsungS25Ultra #Vrindavan #ViralVideo pic.twitter.com/BQxqPtviyt
— TIMES NOW (@TimesNow) March 17, 2025