Viral Video : ఆడవాళ్ళ జోలికి వస్తే తాటతీస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఈ జనసైనికుడి విషయంలో ఏం చేస్తారో?: వీడియో వైరల్

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. నర్సీపట్నం ప్రాంతానికి చెందిన ఓ యువకుడు జనసేన పార్టీ సోషల్ మీడియా కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఇతడు ఓ యువతిని కొంతకాలంగా వేధిస్తూ వస్తున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 9, 2024 1:36 pm

Pawan Kalyan

Follow us on

Viral Video :  ఆ మధ్య విజయవాడలో ఓ యువతిని ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేశాడు. చివరికి ఆమెను జమ్ము కాశ్మీర్ దాకా తీసుకెళ్లాడు. ఆ యువతి మిస్సింగ్ పై ఆమె తల్లి ఫిర్యాదు చేసినప్పటికీ.. నాడు అధికారంలో ఉన్న వైసీపీ పెద్దలు పట్టించుకోలేదు. పైగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆ బాధిత యువతి తల్లి ఫిర్యాదు చేసింది. తో ఆయన పోలీసులకు ఆదేశాలు చేయడం.. ఆగ మేఘాల మీద వారు ఆ అమ్మాయి ఆచూకీ కనుక్కొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం చకాచకా జరిగిపోయాయి.

ఆ యువతిని రక్షించిన తర్వాత పోలీసులను అభినందించిన పవన్ కళ్యాణ్.. అమ్మాయిల జోలికి ఎవరు వచ్చినా తాట తీస్తానని హెచ్చరించారు. ఈ హెచ్చరిక తన సొంత పార్టీ నాయకులకు కూడా వర్తిస్తుందని ఆయన అన్నారు. అయితే ఆయన హెచ్చరికలను కొంతమంది పార్టీ కార్యకర్తలు పెడచెవిన పెడుతున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. నర్సీపట్నం ప్రాంతానికి చెందిన ఓ యువకుడు జనసేన పార్టీ సోషల్ మీడియా కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఇతడు ఓ యువతిని కొంతకాలంగా వేధిస్తూ వస్తున్నాడు. ఇదే సమయంలో ఆమె అతడిని తనని ఇబ్బంది పెట్టొద్దని వేడుకున్నది. అయినప్పటికీ అతడు తన ధోరణి మానుకోలేదు. పైగా ఆమె ఇంటికి వచ్చి గొడవ చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఆ యువతి తట్టుకోలేక తన కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు కూడా చెప్పి చూశారు. అయినప్పటికీ అతడు తన పద్ధతి మార్చుకోలేదు. ఒకరోజు ఆ యువతి ఇంటి మీదికి ఆ యువకుడు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు అతన్ని పట్టుకున్నారు. ముకుమ్మడిగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతమైన ప్రచారంలో ఉంది.

పోలీస్ కేసు నమోదయిందో? లేదో?

ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు అయిందో? లేదో తెలియ రాలేదు. ఆ వీడియోలో ఆ యువకుడిని ఆ యువతి కుటుంబ సభ్యులు పట్టుకున్నారు. ఆమె అతడిని దూషిస్తూ చెంప దెబ్బలు కొట్టింది. ఒక మహిళ అయితే చెప్పుతో అతడిపై దాడి చేసింది. ఆ తర్వాత ఆ యువతి కుటుంబ సభ్యులు అతడితో అసలు విషయం చెప్పించారు. దీనిని కొంతమంది వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియోను వైసిపి పార్టీ అనుబంధ సోషల్ మీడియా కార్యకర్తలు తెగ ట్రోల్ చేస్తున్నారు. ” పవన్ కళ్యాణ్ ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెబుతుంటాడు. ఎవరైనా అలాంటి పనులు చేస్తే తాట తీస్తానని బెదిరిస్తాడు.. బయట వ్యక్తులేమో గాని.. ఆయన పార్టీకి చెందిన సొంత కార్యకర్తలు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. మరి అలాంటి వ్యక్తులపై పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? బయట వ్యక్తులపై మాదిరిగానే పోలీసు కేసులు పెట్టిస్తారా? కఠిన చర్యలు తీసుకుంటారా? శిక్షలు పడే విధంగా చేస్తారా రా? మెరుగైన పరిపాలన అంటే ఇదేనా? ఆడవాళ్లను వేధించడం ఎందుకు? ఇలా దెబ్బలు తినడం ఎందుకని” వైసిపి సోషల్ మీడియా విభాగం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మరి అతనిపై జనసేన పార్టీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.