Kaniha: తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కనిహ మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుంది. ఆమె అనేక యాడ్స్ లో నటించింది. ది చెన్నై సిల్క్స్, కళ్యాణ్ శారీస్ అండ్ జ్యువెలర్స్ తో పాటు పలు సంస్థల వ్యాపార ప్రకటనల్లో ఆమె కనిపించింది. మరోవైపు నటిగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యింది. 2002లో ఫైవ్ స్టార్ టైటిల్ తో విడుదలైన తమిళ చిత్రంలో ఆమె తొలిసారి నటించింది. అనంతరం ఆమెకు శ్రీకాంత్ కి జంటగా అవకాశం వచ్చింది. 2003లో విడుదలైన ఒట్టేసి చెబుతున్నా చిత్రంలో కనిహ హీరోయిన్ గా ఎంపికైంది.
ఒట్టేసి చెబుతున్నా చిత్రం సూపర్ హిట్ కావడం విశేషం. అనంతరం నా ఆటోగ్రాఫ్ మూవీలో రవితేజకు జంటగా నటించింది. కనిహకు తెలుగులో పెద్దగా ఆఫర్స్ రాలేదు. ఆమె మలయాళంలో అధికంగా చిత్రాలు చేసింది. అనంతరం తమిళ్, కన్నడ భాషల్లో నటించింది. క్యూట్ గా ఉండే కనిహ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆమె స్టార్ హీరోయిన్ కాలేకపోయింది.
కనిహ లుక్ చూసిన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆమె ముఖం కాలిన గాయాలతో కనిపించింది. దాంతో కనిహకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఆమెకు నిజంగా గాయాలు కాలేదు. ఓ మూవీలో పాత్ర కోసం అలా తయారయ్యారు. విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం). ఈ చిత్రంలో కనిహ ఒక పాత్ర చేసింది. ఆ పాత్రలో లుక్ కనిహ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యింది.
విజయ్ చివరి చిత్రంగా గోట్ విడుదలైంది. విజయ్ డ్యూయల్ రోల్ చేశాడు. ప్రభుదేవా, లైలా, జయరామ్, మీనాక్షి చౌదరి, ప్రశాంత్ వంటి భారీ క్యాస్ట్ నటించారు. గోట్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. తెలుగులో పెద్దగా ఆదరణ దక్కలేదు. గోట్ చిత్రంలో కనిహ గెస్ట్ రోల్ చేసింది. ఆ పాత్ర కోసమే కనిహ అలా తయారైంది. కాబట్టి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నమాట.
ఇక కనిహ చేతిలో చెప్పుకోదగ్గ ఆఫర్స్ లేవు. అడపాదడపా అవకాశాలతో ఆమె నెట్టుకొస్తోంది. కాగా కనిహ మల్టీ టాలెంటెడ్. ఆమెకు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడాను. అలాగే పాటలు కూడా పడుతుంది. సీరియల్స్ తో పాటు డిజిటల్ సిరీస్లలో నటించింది. అటు బుల్లితెర ప్రేక్షకుల్లో కూడా ఆమెకు ఫేమ్ ఉంది.
Web Title: Heroine kaniha shocking look goes viral on social media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com