Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Telangana » Today kaloji jayanthi telangana language day

Kaloji Narayana Rao : గాయపడిన గుండె ఘోష.. మట్టి మనుషుల భాస.. అదే తెలంగాణ భాష.. నేడు తెలంగాణ తొలి పొద్దు కాళోజి జయంతి

అన్యాయాన్ని ఎదిరించి.. గొడవకు సంతృప్తిని ఇచ్చుకున్న మహాకవి. అన్యాయాన్ని అంతరించి.. తనకు ముక్తి ప్రాప్తి కలిగించాలని కోరుకున్న కవి. ఆయన జయంతి నేడు.. ఆయన జయంతి రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార భాషా దినోత్సవం గా నిర్వహిస్తోంది.

Written By: Anabothula Bhaskar , Updated On : September 9, 2024 / 12:35 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Today Kaloji Jayanthi Telangana Language Day

Kaloji Narayana Rao Jayanthi

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Kaloji Narayana Rao : పుట్టుక నీది కావచ్చు. చావు కూడా నీది కావచ్చు. బతుకు మొత్తం దేశానిది.. ఇలా రాయాలంటే గుండె ధైర్యం కావాలి. అలా చెప్పాలంటే ఆ మనిషికి జనం బాధ తెలిసి ఉండాలి. కన్నీటి కష్టాల నుంచి వచ్చిన వాడై ఉండాలి. అలాంటివాడే కాలోజి నారాయణరావు. అన్యాయాన్ని ఎదిరించి.. గొడవకు సంతృప్తిని ఇచ్చుకున్న మహాకవి. అన్యాయాన్ని అంతరించి.. తనకు ముక్తి ప్రాప్తి కలిగించాలని కోరుకున్న కవి. ఆయన జయంతి నేడు.. ఆయన జయంతి రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార భాషా దినోత్సవం గా నిర్వహిస్తోంది.

ఉద్యమమే కాళోజీ నారాయణరావు ఊపిరిగా జీవించారు. 1914 సెప్టెంబర్ 9 కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని రట్టి హళ్లి గ్రామంలో ఆయన జన్మించారు. నారాయణరావు తల్లి రామాబాయమ్మ . ఈమె పూర్వీకులు కన్నడ వాసులు.. కాళోజి తండ్రి పేరు రంగారావు. ఈయన స్వస్థలం మహారాష్ట్ర. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పీవీ నరసింహారావు వంటి వారితో కాళోజి అనేక ఉద్యమాలు చేశారు. ఆయన విద్యార్థి దశలో ఉన్నప్పుడు నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ఉల్లంఘించారు. వరంగల్ లో గణపతి ఉత్సవాలను నిర్వహించారు. తెలంగాణ లో ప్రజలకు అక్షర జ్ఞానాన్ని కలిగించాలని కోరికతో ఆంధ్ర సారస్వత పరిషత్ ను ఏర్పాటు చేసిన వారిలో కాళోజీ ముందు వరుసలో ఉంటారు. రజాకర్ల దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ 1945లో ఆంధ్ర సరస్వతి పరిషత్ ద్వితీయ మహాసభలను విజయవంతంగా నిర్వహించడంలో నారాయణరావు అనితర సాధ్యమైన తెగువను ప్రదర్శించారు. నాటి ధైర్య సాహసాలను ఆయన అభిమానులు కథలుగా చెప్పుకుంటున్నారు. వరంగల్ కోటలో జాతీయ జెండాను ఎగరవేసేందుకు ఆరోజు ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా ఆయనను నాటి నిజాం ప్రభుత్వం నగర బహిష్కరణ చేసింది. స్వరాజ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు వారిని మహారాష్ట్రలోని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించారు. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. 1958 లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసన మండల కి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.. కాళోజీని కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించింది.

రాజ్య హింస తప్పు

హింసను తప్పుడు మార్గముగా కాళోజీ భావించారు. రాజహింసను మరింతగా తప్పుడు పట్టేవారు. సామాన్యుడు తన దేవుడని కొనియాడేవారు. 22 నవంబర్ 13న ఆయన కన్నుమూశారు. ఆయన మరణం అనంతరం పార్థివ దేహాన్ని కాకతీయ వైద్య కళాశాలకు అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడుగా 1958 నుంచి 1960 వరకు కాళోజి పని చేశారు. దాదాపు రెండు సంవత్సరాలపాటు స్వతంత్ర శాసనమండలి సభ్యుడుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో సభ్యుడిగా కొనసాగారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా 1957 నుంచి 1960 వరకు గ్లోసరి కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 1977 లో స్వతంత్ర అభ్యర్థిగా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. కాళోజి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవం గా ప్రభుత్వం ప్రకటించింది. నెంబర్ 9న కాళోజీ 100 జయంతి సందర్భంగా అప్పటి ప్రభుత్వం ఆయన జయంతిని తెలంగాణ భాష దినోత్సవంగా ప్రకటించి నిర్వహిస్తోంది. తెలంగాణ సాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి కాళోజి పురస్కారాన్ని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ అందిస్తుంది.

Anabothula Bhaskar

Anabothula Bhaskar Author - OkTelugu

Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

View Author's Full Info

Web Title: Today kaloji jayanthi telangana language day

Tags
  • Kaloji kala Kshethram
  • Kaloji Narayana Rao
  • Kaloji Narayana Rao Jayanthi
  • telangana language day
  • Telangana News
Follow OkTelugu on WhatsApp

Related News

Sangeetha Srinivas Shocking Comments on Revanth: ఏవమ్మా.. సీఎంను పట్టుకొని ఏంటా మాటలు.. చూసుకోవాలి కదా(వీడియో)

Sangeetha Srinivas Shocking Comments on Revanth: ఏవమ్మా.. సీఎంను పట్టుకొని ఏంటా మాటలు.. చూసుకోవాలి కదా(వీడియో)

Business Pressures vs Truth:  నిరుటి కమిషన్ కే దిక్కులేదు.. ఇప్పుడు కొత్తగా పేపర్ టార్గెట్లా?

Business Pressures vs Truth: నిరుటి కమిషన్ కే దిక్కులేదు.. ఇప్పుడు కొత్తగా పేపర్ టార్గెట్లా?

Gaddar Awards Function: నేడు ఒకే వేదికపై చిరంజీవి,అల్లు అర్జున్, సీఎం రేవంత్ రెడ్డి..చరిత్రలో నిలిచిపోయే ఈవెంట్!

Gaddar Awards Function: నేడు ఒకే వేదికపై చిరంజీవి,అల్లు అర్జున్, సీఎం రేవంత్ రెడ్డి..చరిత్రలో నిలిచిపోయే ఈవెంట్!

Kavitha meet KCR : కేసీఆర్ ను కవిత ఎందుకు కలిసినట్టు? ఏం జరుగుతోంది?

Kavitha meet KCR : కేసీఆర్ ను కవిత ఎందుకు కలిసినట్టు? ఏం జరుగుతోంది?

Phone Tapping Case : అరెస్ట్‌ కావడానికివచ్చి ఇంత హంగామానా ఐపీఎస్‌ సారూ..

Phone Tapping Case : అరెస్ట్‌ కావడానికివచ్చి ఇంత హంగామానా ఐపీఎస్‌ సారూ..

Maganti Fake Death News : బతికున్న మనిషిని చనిపోయాడని చెబుతారా? “మాగంటి” పై బ్రేకింగ్ న్యూస్ లు దారుణం!

Maganti Fake Death News : బతికున్న మనిషిని చనిపోయాడని చెబుతారా? “మాగంటి” పై బ్రేకింగ్ న్యూస్ లు దారుణం!

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.