Comedian Ali counters to Rajendra Prasad : సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) ఈమధ్య కాలంలో ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. ఇన్నేళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానం లో ఎప్పుడూ చూడని నెగటివిటీ ని ఆడియన్స్ నుండి రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు చూస్తున్నాడు. అందుకు కారణం ఆయన నోటి దూలనే అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ‘రాబిన్ హుడ్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు డేవిడ్ వార్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన మాట్లాడిన ఆ మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యి జనాల నుండి వ్యతిరేకత రావడంతో వెంటనే స్పందించి క్షమాపణలు చెప్తూ ఒక వీడియో ని విడుదల చేశారు. ఈ ఘటన జరిగిన కొన్నాళ్లకే మళ్ళీ ఆయన కమెడియన్ అలీ(Comedian Ali) పై నోరు తూలడం సంచలనంగా మారింది.
Also Read : ఎట్టకేలకు ‘రాజా సాబ్’ మూవీ విడుదల తేదీని ప్రకటించిన నిర్మాతలు..టీజర్ ఎప్పుడంటే!
ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి రాజేంద్ర ప్రసాద్ పై విపరీతమైన నెగటివిటీ ఏర్పడడం తో కాసేపటి క్రితమే కమెడియన్ అలీ దీనిపై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘అందరికీ నమస్కారం..నిన్న SV కృష్ణా రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మేమంతా అతిథులుగా పాల్గొన్నాము. ఈ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ గారు నా గురించి మాట్లాడుతూ కాస్త నోరు జారాడు. దీనిని మీడియా మిత్రులు బాగా వైరల్ చేస్తున్నారు. ఆయన ఒక గొప్ప నటుడు. ఆయన మొన్నటి వరకు పుట్టెడు దుఃఖం లో ఉన్నాడు. ఎందుకో మన అందరికీ తెలుసు. తాను అమ్మ లాగ భావించిన కూతురు చనిపోయింది. ఇలాంటి సమయంలో ఈ నెగటివిటీ ఆయన వరకు చేరడం మంచిది కాదు. ఎదో సరదాగా అన్న మాటలే అవి, దయచేసి దీనిని పెద్దది చేయకండి . ఆయన పెద్దాయన’ అంటూ చెప్పుకొచ్చాడు. అలీ మాట్లాడిన ఈ మాటలకు సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సభా ముఖంగా అంత పెద్ద మాట మాట్లాడినా కూడా అతన్ని ఏమి అనకండి అంటూ ప్రత్యేకంగా వీడియో చేస్తున్నావంటే నీ మనసు చాలా గొప్పది అని అంటున్నారు.
ఎప్పుడూ లేని విధంగా రాజేంద్ర ప్రసాద్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు. వయస్సు మీద పడుతుంది లోపు ఒక మనిషికి తన శరీరం పైన, నోటి మీద కానీ అదుపు ఉండదు. అలా వయస్సు రీత్యా రాజేంద్ర ప్రసాద్ ఇలా ప్రవర్తిస్తున్నాడా?, లేకపోతే కూతురు చనిపోయిన తర్వాత మానసిక ఒత్తిడికి గురై ఇలా మారిపోయాడా అని అంటున్నారు నెటిజెన్స్. ఇకపోతే ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్టుగా వరుసగా సినిమాలు చేస్తూ ఎన్నో అద్భుతమైన పాత్రలు చేస్తున్న రాజేంద్ర ప్రసాద్, రీసెంట్ గానే షష్ఠి పూర్తి అనే చిత్రం లో ప్రధాన పాత్ర పోషించింది. రాబోయే రోజుల్లో ఆయన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో కూడా నటించబోతున్నట్టు తెలుస్తుంది.
#RajendraPrasad ఆయనకి ఈవెంట్ లో మాట తూలింది, ఆయన మంచి ఆర్టిస్ట్ – Actor ALi pic.twitter.com/92sUqj9WTP
— Rajesh Manne (@rajeshmanne1) June 2, 2025