Triptii Dimri in Spirit Movie : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరు వాళ్లను వాళ్ళు ఎలివేట్ చేసుకునే ప్రక్రియలో మంచి సినిమాలను చేయడానికి కొత్త కథలను రాస్తూ ఉంటారు. ఇక అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sundeep Reddy Vanga)… ఇలాంటి స్టార్ డైరెక్టర్ సైతం మీకు పోటీ ఇచ్చే దర్శకుడు ఎవరు అంటే ఆయన సందీప్ రెడ్డివంగ పేరు చెప్పాడు. సందీప్ మేకింగ్ స్టైల్ అంటే తనకు ఇష్టమని అందువల్లే ఆయన నాకు పోటీ ఇచ్చే దర్శకుడుగా ఎదుగుతాడు అంటూ సందీప్ గురించి రాజమౌళి చెప్పిన ప్రతి మాట అతని అభిమానులను ఆనందానికి గురి చేసింది. ప్రస్తుతం స్పిరిట్ (Spirit) సినిమాలో త్రిప్తి డిమ్రి (Thripthi Dimri) ని హీరోయిన్ గా తీసుకున్న సందీప్ రెడ్డి వంగ అనిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన ఆమెను ఒక పాన్ వరల్డ్ సినిమాలో హీరోయిన్ గా ఎందుకు తీసుకున్నాడు అంటూ కొంతమంది ప్రభాస్ అభిమానులు సైతం వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : రాజేంద్ర ప్రసాద్ కి కౌంటర్ ఇచ్చిన కమెడియన్ అలీ..వీడియో వైరల్!
నిజానికి త్రిప్తి డిమ్రి కి పెద్దగా ఇమేజ్ అయితే లేదు. ఆమె సాధించిన సక్సెస్ లు కూడా లేవు అయినప్పటికి ఆయన సినిమాల్లో హీరోయిన్ కి పెద్దగా పాత్రలైతే ఉండవు. కాబట్టి హీరోయిన్ కి సపోర్ట్ చేసే పాత్రగా తను ఉంటే సరిపోతుంది అనే ఉద్దేశ్యంతో ఆయన తృప్తి ని సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇక అందులోనూ ఈ సినిమా కోసం ఆమె కేవలం నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ ను మాత్రమే తీసుకోవడం అనేది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి ఏది ఏమైనా కూడా త్రిప్తి ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అంటూ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట… ఈ మూవీలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.
ఈ మూవీలో అన్యాయం చేసే వాళ్లనుంచి జనాలను ఎలా కాపాడుతాడు అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే అంటూ మరికొంత మంది కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సందీప్ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి పెను ప్రభంజనాలను సృష్టిస్తోంది అనేది చూడాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…