Glenn Maxwell Annouced Retirement : ఇటీవల టీమిండియా లెజెండరీ ప్లేయర్లు రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముందుగా రవిచంద్రన్ అశ్విన్, ఆ తర్వాత రోహిత్ శర్మ, అనంతరం విరాట్ కోహ్లీ ఆ నిర్ణయాలను ప్రకటించారు. వీరి ముగ్గురి తర్వాత శ్రీలంక ప్లేయర్ ఏంజెల్ మాథ్యూస్ కూడా టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇక ఈ జాబితాలో ఇప్పుడు కంగారు జట్టు ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ కూడా చేరిపోయాడు. వన్డేల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు అతడు వెల్లడించాడు. పొట్టి ఫార్మాట్లో మాత్రం అందుబాటులో ఉంటానని అతని ప్రకటించాడు..మాక్స్ వెల్ వయసు ప్రస్తుతం 36 సంవత్సరాలు. 2012లో కంగారు జట్టు తరఫున వన్డేలలోకి అతడు ఎంట్రీ ఇచ్చాడు. 2013 ప్రపంచకప్లో అదరగొట్టాడు..2015 లో ఐసీసీ విశ్వకప్ సాధించిన కంగారు జట్టులో అతడికి కీలక సభ్యుడిగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం మ్యాక్సీ టి20 ఫార్మాట్ మాత్రం ఆడతాడు.
Also Read :గోల్డ్ అండి… గోల్డ్.. అయ్యర్ బ్యాటింగ్ కు అంబానీల ముఖాలైనా వాడిపోల్సిందే! వైరల్ వీడియో!
2023 ప్రపంచ కప్లో టెర్రిబుల్ ఇన్నింగ్స్ ఆడి.. ఆఫ్ఘనిస్తాన్ జట్టు చేతిలో కంగారు జట్టు ఓడిపోకుండా చూశాడు. ఈ మ్యాచ్లో మ్యాక్సీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై మహానగరంలో వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్గన్ కంగారు జట్టు ఎదుట 292 రన్స్ టార్గెట్ విధించింది. అయితే ఈ రన్స్ చేసే సమయంలో ఆస్ట్రేలియా ప్లేయర్లు ఏడుగురు అవుట్ అయ్యారు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోర్ 91 మాత్రమే. ఆస్ట్రేలియా ఓడిపోవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. ఈ దశలో మ్యాక్సీ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా ద్వి శతకం సాధించి అదరగొట్టాడు. చివరికి తను నడిచే అవకాశం లేకపోయినప్పటికీ.. కాళ్లు ఇబ్బంది పెడుతున్నప్పటికీ అతడు జట్టును గెలుపు బాటలో నడిపించాడు.
అయితే చాంపియన్స్ ట్రోఫీ సమయంలోనే మ్యాక్సీ ఏ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కంగారు చెట్టు చీఫ్ సెలెక్టర్ కు మ్యాచ్ చెప్పినట్టు తెలుస్తోంది. మ్యాక్సీ 13 సంవత్సరాల పాటు వన్డే క్రికెట్ ఆడాడు. ఏకంగా 149 మ్యాచ్లలో అతడు ప్రాతినిధ్యం వహించాడు. 126.70 స్ట్రైక్ రేట్ తో 3390 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 23 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ లోను అతడు 77 వికెట్లు పడగొట్టాడు..40/4 బౌలింగ్లో అతడి బెస్ట్ గా ఉంది. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో మ్యాక్సీ ఏడు పరుగులు మాత్రమే చేసి.. అక్షర్ పటేల్ బౌలింగ్లో వెను తిరిగాడు. ఆ మ్యాచ్ లో కంగారు జట్టు ఓటమిపాలైంది.
GLENN MAXWELL ANNOUNCED HIS RETIREMENT FROM ODIS.
– Thank you, Maxi. ❤️ pic.twitter.com/Gqz32dXO4Y
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 2, 2025