Viral Video : కుక్కలు.. కూసింత ఆహారాన్ని, కాసింత ఆప్యాయతను ప్రదర్శిస్తే చాలు అచంచలమైన విశ్వాసాన్ని చూపిస్తాయి.. తమ ప్రాణాన్ని సైతం అడ్డువేసి ఆపద నుంచి రక్షిస్తాయి. కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. కుక్కలు విశ్వాసపాత్రమైన జంతువులని అనాది కాలం నుంచే ప్రచారంలో ఉంది. అయితే అలాంటి కుక్కలకు కోపం వస్తే ఎంతటి జంతువునైనా మట్టు పెడతాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేసుకోండి.
సోషల్ మీడియాలో సందడి చేస్తున్న వీడియోలో కుక్కల గుంపు చిరుతపులిని చుట్టుముట్టింది. ముప్పేట దాడి చేసింది. ఆ చిరుత పులిని చంపేందుకు గ్రామ సింహాలు రౌండప్ చేశాయి. చిరుతపులిని కన్ఫ్యూజ్ లో పడేసి అటాక్ మొదలుపెట్టాయి. ముకుమ్మడిగా దానిమీద పడి ఊపిరాడకుండా చేశాయి. కుక్కలు కరచి కరచి ఇబ్బంది పెడుతుండడంతో చిరుత పులి ఆర్తనాదాలు చేసింది. ఈ దృశ్యాన్ని దూరంగా ఉన్న వ్యక్తులు వీడియో తీశారు. ఆ కుక్కలు అలా మీద పడి చిరుత పులిపై దాడి చేస్తుండడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు..
సాధారణంగా అడవుల్లో బలమైన జంతువులదే ఆధిపత్యం నడుస్తుంటుంది. చిన్న చిన్న జంతువులు ఎక్కడో ఒక మూలన దాక్కుంటూ.. ఆహారం దొరికినప్పుడు తింటూ జీవిస్తుంటాయి. ఒకవేళ క్రూరమైన జంతువులకు ఎదురుపడితే అవి తన ప్రాణాలను కోల్పోతాయి. మరోవైపు అడవిలో క్రూరమైన జంతువులు తమ ఆహారం కోసం ఇతర జంతువుల మీద పడుతుంటాయి. దారుణంగా దాడి చేసి చంపి తింటాయి. అయితే సోషల్ మీడియాలో సందడి చేస్తున్న వీడియోలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. అడవిలో క్రూరమైన జంతువుగా పేరుపొందిన చిరుత పులి గ్రామ సింహాల ముందు తలవంచింది.. ఆ కుక్కలు దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయింది. సాధారణంగా చిరుత పులి నిశ్శబ్దంగా వేటాడుతుంది. కన్ను మూసి తెరిచే లోపల దాడి చేసి ఎదుటి జంతువును చంపేస్తుంది. అందుకే దానిని నిశ్శబ్ద శత్రువు అని పిలుస్తుంటారు. అయితే అలాంటి చిరుతపులిని గ్రామ సింహాలు చంపడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సంఘటన ఏ ప్రాంతంలో జరిగిందో తెలియదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. కొంతమంది ఈ సంఘటన ఆఫ్రికా ఖండంలో జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ భూమండలం మీద అత్యధికంగా చిరుత పులులు.. వైవిధ్య భరితమైన అడవులు ఉన్నది ఆఫ్రికా ఖండంలోనే కాబట్టి వారు ఆ వ్యాఖ్యలు చేశారు.
అడవిలో దర్జాగా చిరుతపులిని కుక్కలతో వేటాడి చంపిస్తున్న దృశ్యాలు బాగానే ఉన్నాయి కానీ.. ఇంత జరుగుతున్నా అక్కడ అటవీ శాఖ అధికారులు లేరా అని కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.. ఇది ముమ్మాటికి జంతువులను హతమార్చి, వాటి చర్మం ఇతర అవయవ భాగాల ద్వారా వ్యాపారం చేసే దుర్మార్గుల పని అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. అక్కడి పోలీసులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు..
— NATURE IS BRUTAL (@TheBrutalNature) August 27, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: A group of dogs surrounds a leopard in a video that has gone viral on social media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com