Homeఎంటర్టైన్మెంట్ Mohan Babu-Manoj Kumar  : మోహన్ బాబు చెప్పింది నిజమేనా? వెలుగులోకి మనోజ్ వీడియో..వైరల్

 Mohan Babu-Manoj Kumar  : మోహన్ బాబు చెప్పింది నిజమేనా? వెలుగులోకి మనోజ్ వీడియో..వైరల్

Mohan Babu-Manoj Kumar  : మోహన్ బాబు కన్న కొడుకు మనోజ్ పై పలు ఆరోపణలు చేశాడు. తాగుడుకు బానిసయ్యాడు. పనివాళ్లను కూడా కొడుతున్నాడు. అబద్దాలు చెబుతున్నాడు.. అంటూ ఆడియో విడుదల చేసిన మోహన్ బాబు ఆరోపణలు చేశాడు. మోహన్ బాబు చెప్పింది నిజమే అన్నట్లు రుజువు చేసే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనోజ్ కి సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న కుటుంబ పెద్ద పట్ల మనోజ్ అమర్యాదపూర్వకంగా ప్రవర్తించిన వీడియో బయటకు వచ్చింది.

మంచు ఫ్యామిలీలో సంక్షోభం చోటు చేసుకుంది. మోహన్ బాబు-మనోజ్ మధ్య కొన్నాళ్లుగా నడుస్తున్న కోల్డ్ వార్ తీవ్ర రూపం దాల్చింది. తండ్రి కొడుకులు భౌతిక దాడులు చేసుకున్నారు. ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. మోహన్ బాబు ఫార్మ్ హౌస్ జుల్పల్లి వద్ద రెండు రోజులు హైడ్రామా నడిచింది. ఇంట్లోకి రాకుండా మనోజ్ ని మోహన్ బాబు మనుషులు అడ్డుకున్నారు. ఘర్షణ వాతావరణం నెలకొంది.

పోలీసులు రంగంలోకి దిగి.. మంచు ఫ్యామిలీకి వార్నింగ్ ఇచ్చారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ అశాంతి, లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తే ఊరుకునేది లేదని గట్టిగా చెప్పారు. మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లకు క్లాస్ పీకారు. కాగా మోహన్ బాబు మనోజ్ పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. భార్య మాటలు వింటూ మనోజ్ ముందుకు బానిసయ్యాడు. ఇంట్లో పనివాళ్లను కొడుతున్నాడు. ఒకడైతే చనిపోవాల్సింది. మనోజ్ ని నేను చాలా బాగా చూసుకున్నాను. అడిగింది లేదనకుండా ఇచ్చాను.

ఎంతో పేరున్న మా విద్యాసంస్థల మీద ఆరోపణలు చేస్తున్నాడు… అని మోహన్ బాబు ఆవేదన వెళ్లగక్కాడు. మోహన్ బాబు చెప్పింది నిజమే అన్నట్లు రుజువు చేస్తూ ఓ వీడియో వైరల్ అవుతుంది. సదరు వీడియోలో మనోజ్ ఊగిపోతున్నాడు. మనోజ్ కి సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న ఓ కుటుంబ పెద్దను మర్యాదలేకుండా మాట్లాడాడు. నువ్వు ఎవడివి మాకు చెప్పడానికి, ముసలోడా పక్కకు తప్పుకో.. అంటూ అవమాన పరిచాడు. ఈ వీడియో వైరల్ అవుతుంది.

RELATED ARTICLES

Most Popular