Viral Video : ఆర్ ఆర్ ఆర్ ఒక విజువల్ వండర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల ఈ మల్టీస్టారర్ రూ. 1200 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ వసూళ్లు రాబట్టింది. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు కైవసం చేసుకుంది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా అద్భుతం చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్… భీమ్, రామరాజు పాత్రల్లో నటించి మెప్పిచారు. ఆర్ ఆర్ ఆర్ లో ఈ రెండు పాత్రల స్వభావం బిన్నంగా ఉంటుంది. లక్ష్యం మాత్రమే ఒక్కటే.
అయితే ఆర్ ఆర్ ఆర్ మూవీలో పుష్పరాజ్ రోల్ ఉంటే ఎలా ఉంటుంది. భీమ్-పుష్పరాజ్ కాంబినేషన్ సీన్స్ పడితే ఎలా ఉంటాయి. ఈ ఆలోచన వచ్చిన ఒక మీమర్ చేసిన ఎడిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భీమ్ సీన్స్ కి పుష్పరాజ్ పాత్ర జోడించి ఎడిట్ చేశారు. ఈ మీమ్ కట్టిపడేస్తుంది. చాలా ఫన్నీగా ఉంది. నవ్వులు పూయిస్తోంది. చేసింది ఎవడో కానీ క్రియేటివిటీ అదిరింది అంటున్నారు.
మరోవైపు పుష్ప 2 తో అల్లు అర్జున్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ బడా హీరోలకు చెమటలు పట్టిస్తున్నాడు. సౌత్ హీరో అల్లు అర్జున్ మూవీ.. లోకల్ స్టార్స్ చిత్రాల రికార్డ్స్ లేపేస్తుంది. కేవలం ఐదు రోజుల్లో పుష్ప 2 హిందీ వెర్షన్ రూ. 339 కోట్ల వసూళ్లు రాబట్టింది. వర్కింగ్ డే సోమవారం కూడా పెద్దగా ఫాల్ కనిపించలేదు. పుష్ప 2 హిందీ వసూళ్లు చాలా స్ట్రాంగ్ గా ఉంది. అత్యంత వేగంగా రూ. 300 కోట్ల వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా రికార్డులకు ఎక్కింది.
వరల్డ్ వైడ్ పుష్ప 2 వసూళ్లు రూ. 1000 కోట్లకు చేరువయ్యాయి. ఫస్ట్ వీక్ కి పుష్ప 2 ఈ మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడం ఖాయం. సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో నాలగవ చిత్రంగా పుష్ప 2 తెరకెక్కింది. రష్మిక మందాన హీరోయిన్. ఫహద్ ఫాజిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేష్ కీలక రోల్స్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
Yevadra Edhi chesindhi super Undadhi
Miru kuda Sudandi #Pushpa #RRR Mix
insta lo Dhorikindhi #Pushpa2 #RRRMovie #AlluArjun #NTR #Ramcharan @alluarjun @tarak9999 @AlwayzRamCharan pic.twitter.com/WO2T0QUPWg— ArjunuAA (@Arjunu_666) December 10, 2024
Web Title: A video of the rrr movie featuring pushparaj and bheem goes viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com