Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. ఈ క్రమంలో రోజూ ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో అయితే చెప్పక్కర్లేదు. సరదాగా ఇంట్లో జరిగిన ప్రతీ విషయాన్ని రికార్డు చేసి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా అప్‌లోడ్ చేస్తుంటే కొన్ని నిమిషాల వ్యవథిలోనే వైరల్ అవుతున్నాయి. ఇలా ఎన్నో వీడియోలు రోజూ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొందరు అయితే కొన్నింటిని కావాలనే వైరల్ చేస్తుంటారు. ఇలా సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి రకరకాల వంటలు, ఎందరో వారిలో ఉన్న ప్రతిభ కూడా బయట పడింది. నిజం చెప్పాలంటే సోషల్ మీడియా చాలా మందికి లైఫ్‌ని కూడా ఇచ్చింది. సోషల్ మీడియా వల్ల చాలా మంది స్టార్లగా కూడా మారారు. వారి జీవితాలు కూడా ఎంతో బాగుపడ్డాయి. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియాలో కొందరు విచిత్రమైన వంటలు చేస్తుంటారు. రకరకాల పదార్థాలతో కొన్ని స్పెషల్ ఐటెమ్స్ చేస్తుంటారు. వీటిని చూస్తుంటేనే కొందరికి వాంతులు వచ్చేస్తాయి. అలాంటిది వారు చేసిన ఆ ఐటెమ్స్‌ను ఎలా తింటారో అర్థం కాదు. కొన్నిసార్లు అనిపిస్తుంది.. అసలు వారు ఆ ఐటెమ్స్ తింటారా? అని డౌట్ కూడా వస్తుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ టాయిలెట్ చికెన్ రెసిపీ వీడియో వైరల్ అవుతోంది. ఓ టాయిలెట్ సీట్‌లో యమ్మీ చికెన్‌ను క్లీన్ చేసి దానికి గార్నిష్ చేసిన ఘటన నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
టర్కీకి చెందిన ఓ వ్యక్తి టాయిలెట్ సీట్‌లో చికెన్ పెట్టాడు. దీని లోపల ఉల్లిపాయ, టమోటా వంటివి పెట్టి, గార్నిష్ చేశాడు. వాటిపై మసాలా వంటివన్నీ చల్లి టాయిలెట్ సీట్‌పైన కొంత సమయం ఉంచిన తర్వాత దాన్ని ఓవెన్‌లో పెడతారు. ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. టాయిలెట్ సీట్‌పైన యమ్మీ చికెన్‌ను తయారు చేసి తినడమేంటని కంగు తింటున్నారు. ఇలాంటి చికెన్‌ను చూస్తేనే వాంతులు వస్తున్నాయి. అలాంటిది వారు చేసి ఎలా తింటారని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ టాయిలెట్ సీట్ కొత్తది అని, ఇంకా వాడలేదు ఏమో అందుకే ఇలా చేశారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు కేవలం రీల్ కోసమే ఇలా చేసినట్లు ఉన్నారు. సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఇలా ప్రయత్నించారని అంటున్నారు. అంతే కానీ ఇలా టాయిలెట్ సీట్‌లో చేసిన పదార్థాన్ని తినరు. కేవలం చూడటానికి మాత్రమే ఇలా చేశారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. టర్కీకి చెందిన ఈ టాయిలెట్ చికెన్ రెసిపీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
https://twitter.com/JamalibnAmin/status/1862189509862940722