https://oktelugu.com/

Viral Video: వంటగదిలో బాడీకి ఫ్యాన్.. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు

వంటింట్లో ఎండాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఆడవాళ్లకు బాగా తెలుసు. ఒకవైపు ఎండవేడి.. ఇంకో వైపు పొయ్యి వేడి. ఈ రెండింటి మధ్య ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దవుతుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 23, 2024 / 05:04 PM IST

    man innovation in kitchen

    Follow us on

    Viral Video: వేసవి వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో వేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఉక్కపోత చికాకు పుట్టిస్తోంది. ఇక వంటింట్లో ఉండే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉన్నా.. వంటింట్లో మాత్రం వాటిని ఉపయోగించలేం. ఎందకంటే అవి ఉంటే వంట చేయలేం. ఇక వాష్‌రూంలో కూడా ఫ్యాన్లు ఉండవు. ఈ రెండు ప్రదేశాల్లో అందరూ ఎండాకాలాన్ని ఫీల్‌ అవ్వాల్సిందే.

    ఆ బాధ ఆడవాళ్లకే తెలుసు
    వంటింట్లో ఎండాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఆడవాళ్లకు బాగా తెలుసు. ఒకవైపు ఎండవేడి.. ఇంకో వైపు పొయ్యి వేడి. ఈ రెండింటి మధ్య ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వంటగదిలో చెమటలు తప్పవు. అయితే సమస్య ఉంటేనే దానికి పరిష్కారం ఉంటుంది. ఏ ఆవిష్కరణ అయినా.. సమస్య, అవసరం నుంచే పుట్టుకొస్తాయి. ఇప్పుడు వంటగదిలో ఉండే ఉక్కపోతకు ఓ వ్యక్తి పరిష్కారం కొనుగొన్నాడు. అతని ఐడియా చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

    సోషల్‌ మీడియాలో వైరల్‌..
    ఇక వంట్టింట్లో ఉక్కపోతకు కనుగొన్న పరిష్కారానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అతను ఒక టేబుల్‌ ఫ్యాన్‌ తీసుకుని ఒక స్టాండ్‌ కి ఫిక్స్‌ చేశాడు. దానిని టేపుతో తన శరీరానికి అంటించుకున్నాడు. నిజానికి ఇది ఫన్నీగా చేసిన వీడియో. కానీ, అతని ఐడియాకి మాత్రం నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతనికి ఎంత కష్టం రాకపోతే ఇంత బాగా ఆలోచిస్తాడు అంటూ పొగుడుతున్నారు. ఈ ఆలోచన చాలా కొత్తగా, కొంచెం రిస్క్‌తో కూడుకున్నదిగా ఉంది. ఆచరణ సాధ్యం కాకపోయినా చూసి నవ్వుకోవడానికి ఉపయోగపడుతుంది.