soap truck accident : సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో పై ఉపోద్ఘాతానికి నిలువెత్తు నిదర్శనం లాగా కనిపిస్తోంది. ఆ వీడియోలో ప్రకారం ఓ హైవే మీద లారీ బోల్తా పడింది. లారీ బోల్తా పడటం వల్ల డ్రైవర్ గాయపడ్డాడు. వాస్తవానికి డ్రైవర్ కు ఎవరూ సహాయం చేయలేదు. కాకపోతే ఆ లారీ బోల్తాపడటం వల్ల కిందపడిన పెట్టెలను చాలామంది ఎత్తుకుపోయారు. పోటీలు పడి ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆ పెట్టెలలో ఉన్నది మద్యం కాదు. చమురు అంతకన్నా కాదు. విలువైన వస్తువులు అసలు కానేకాదు. ఆ పెట్టెలలో ఉన్నది సబ్బులు. ఆ సభ్యులను జనాలు పోటీపడి ఎత్తుకుపోయారు. తమ ఇళ్లలోకి తీసుకువెళ్లారు..ఈ ప్రమాదం తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకునట్టు తెలుస్తోంది. అక్కడ హైవే మీద అదుపుతప్పి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న సబ్బులు మొత్తం కిందపడ్డాయి.
పోటీలు పడ్డారు
సబ్బులు మొత్తం కింద పడటంతో వాటిని ఇంట్లోకి తీసుకెళ్లడానికి స్థానికులు పోటీలు పడ్డారు. పెట్టెలకు పెట్టెలు ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇంట్లో భారీ ఎత్తున నిల్వ చేసుకున్నారు. అదే సమయంలో లారీ బోల్తాపడటంతో డ్రైవర్ గాయపడ్డాడు. చివరికి కొంతమంది ధైర్యం చేసి అతడిని బయటికి తీశారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయపడ్డాడు. అతడిని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తీసుకెళ్లారు. క్లీనర్ కూడా గాయపడటంతో అతడిని కూడా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసుల వచ్చేసరికి లారీలో ఉన్న సరుకు మొత్తం మాయమైంది. దీంతో చేసేది ఏమీ లేక పోలీసులు కేసు నమోదు చేసి.. గాయపడిన డ్రైవర్ నుంచి వివరాలు సేకరించి వెళ్లిపోయారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లాలో సంచలనం సృష్టించింది.. ఈ ప్రాంతంలో గతంలో చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఆ సమయంలో రోడ్డు మీద ఉన్న చేపలను తీసుకెళ్లడానికి స్థానికులు పోటీపడ్డారు. కొన్ని సంవత్సరాల క్రితం టమాటాల రోడ్డుతో వెళ్తున్న వాహనం కూడా ఇదే తీరుగా బోల్తా పడింది. అప్పుడు కూడా స్థానికులు పోటీలు పడి టమాటాలను తీసుకెళ్లారు. ఇలా అనేక సందర్భాలలో స్థానికులు తమ మానవత్వాన్ని పక్కనపెట్టి.. రోడ్డుపైన ఉన్న సరుకును తీసుకెళ్లడానికే ఆసక్తి చూపించారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన వ్యాప్తిలో ఉంది ..” ఇండియాలో ఇలానే ఉంటుంది. మనుషులకు కాస్త స్వార్థం ఎక్కువగా ఉంటుంది. ఉచితంగా రావాలని అందరు అనుకుంటారు కాబట్టే.. ఇలా రోడ్డుమీద పడిన సరుకులను తీసుకెళ్తుంటారు. మన దేశం బాగుపడదని” నెటిజన్లు పేర్కొంటున్నారు.