Manasarovar: హిమాలయ పర్వత ప్రాంతాలలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఊహకు అందని.. మన అంచనాలకు సరిపోలని శిఖరాలున్నాయి. అవన్నీ కూడా ప్రకృతి రమణీయతకు నిలువుటద్దంలాగా కనిపిస్తున్నాయి. ఇక హిమాలయ పర్వతాలలో మానస సరోవరం గురించి ప్రత్యక్షంగా చెప్పుకోవాలి. ఇది బ్రహ్మ దేవుడి ఆలోచన నుంచి ఆవిర్భవించింది అంటారు. మానస సరోవరాన్ని టిబెట్ అని పిలుస్తుంటారు. ఇది బ్రహ్మదేవుడి ఆలోచన నుంచి పుట్టిందని.. భూమి మీద పడిందని హిందూ పురాణాలలో పేర్కొన్నారు. మానస సరోవరంలో నీటిని తాగితే మరణం అనంతరం నేరుగా స్వర్గానికి వెళ్ళొచ్చని.. కైలాసాన్ని చేరుకోవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఇందులో ఉండే నీటిని తాగితే 100 జన్మలకు సంబంధించిన పాపాలు తొలగిపోతాయని పురాణాలలో పేర్కొన్నారు. ఈ మంచినీటి సరస్సు సమీపంలోనే సింధు, సట్లెజ్, బ్రహ్మపుత్ర నదులు జన్మించాయి.
చైనా ఆక్రమణ వల్ల టిబెట్ తన రూపాన్ని కోల్పోతోంది. ఇక్కడ విలువైన సహజ వనరులు ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లలో ఉపయోగించే అత్యంత విలువైన ఖనిజ వనరులు ఇక్కడ లభిస్తాయి. అందువల్లే చైనా ఈ ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నది. ఈ ప్రాంత పరిరక్షణ కోసం దలైలామా ఉద్యమం చేస్తుంటే.. అతడిని ఇక్కడి నుంచి వెళ్లగొట్టింది. ప్రస్తుతం అతడు భారతదేశంలో తలదాచుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం మానస సరోవరం యాత్రకు వెళ్లినవారు అక్కడి దృశ్యాలను వీడియోలుగా రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మానస సరోవరంలో ఉన్న మంచినీటి సరస్సు అద్భుతంగా కనిపిస్తోంది. స్వచ్ఛమైన నీటితో పాలసముద్రం లాగా దర్శనమిస్తోంది. ఈ సరస్సుకు సమీపంలో ఆకాశాన్ని తాకే ఎత్తులో హిమాలయ పర్వతాలు కనిపిస్తున్నాయి. ఈ హిమాలయ పర్వతాలలోనే కైలాస క్షేత్రం ఉందని పర్యాటకులు నమ్ముతుంటారు. అయితే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పర్వతారోహకులు కైలాస శిఖరాన్ని మాత్రం ఇంతవరకు ఎక్కలేదు. అక్కడికి దరిదాపుల్లో కూడా ఎవరూ వెళ్లలేదు. కైలాస శిఖరంలో శివుడు ఉన్నాడని భక్తులు నమ్ముతుంటారు. అందువల్లే ఆశిఖరాన్ని ఎక్కడానికి ఎవరూ సాహసం చేయరని వివరిస్తున్నారు. గతంలో అనేక పర్యాయాలు పర్వతారోహకులు కైలాస శిఖరాన్ని ఎక్కడానికి ప్రయత్నించారు. చివరికి విఫలమయ్యారు. కొందరైతే అస్వస్థతకు గురయ్యారు.. వాస్తవానికి కైలాస పర్వతంలో ఆక్సిజన్ ఉండదు. పైగా అది భూమికి అత్యంత ఎత్తులో ఉంటుంది. ఎవరెస్ట్ కంటే అక్కడ మరింత తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఒక రకంగా రక్తం గడ్డకట్టే చలి అక్కడ ఉంటుంది. పైగా ఆ శిఖరం మహిమాన్వితమైనదని శాస్త్రవేత్తలు కూడా నమ్ముతుంటారు. అందువల్లే దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లడానికి ప్రయత్నం చేయరు.
అత్యద్భుతంగా ఉంది
మానస సరోవరం యాత్రకు వెళ్లినవారు అక్కడ దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. భూలోకంలో స్వర్గం ఇదేనని.. స్వర్గం కూడా ఇంతకంటే గొప్పగా ఉండదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. యాత్రికులు పోస్ట్ చేసిన వీడియోలో మానససరోవరంలోని సరస్సు అత్యంత అద్భుతంగా కనిపిస్తోంది. అందులో చూసేందుకు ఒక్క మలినం కూడా కనిపించడం లేదు.
ఎలా చేరుకోవాలంటే
మానస సరోవరం గతంలో టిబెట్లో ఉండేది. అయితే దానిని చైనా ఆక్రమించడంతో డ్రాగన్ దేశం పరిధిలోకి వెళ్ళింది. మన దేశం మీదుగా మానస సరోవరం వెళ్లాలంటే.. ఉత్తరాఖండ్ రాష్ట్రం చేరుకోవాలి. అక్కడ దార్చుల, లిపుఖేష్ అనే ప్రాంతాన్ని కలుపుతూ ఇటీవల కొత్త రహదారి నిర్మించారు. అది మానసరోవరం వెళ్లే ప్రాంతాన్ని, మన దేశాన్ని కలుపుతుంది.. ఈ రహదారి కైలాష్ మానస సరోవర్ యాత్ర దూరాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.. పర్యటకులు లిపులేఖ్ పాస్ మీదుగా చైనాకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐదు కిలోమీటర్ల పాటు నడవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 173 కిలోమీటర్ల రహదారి ప్రయాణం సాగించాలి. అయితే ఈ ప్రయాణం అనుకూనంత ఈజీగా ఉండదు. కేవలం ఉత్తరాఖండ్ మాత్రమే కాకుండా సిక్కిం, నేపాల్ మీదుగా కూడా మానససరోవరం చేరుకోవచ్చు. కాకపోతే ప్రతి ఏడాది మానస సరోవరానికి వెళ్లే పర్యాటకులను బృందాలుగా మన దేశం పంపిస్తుంది. కొన్ని పర్యటక సంస్థలు ప్రత్యేకమైన ప్యాకేజీలు కూడా అమలు చేస్తున్నాయి. ఆర్థిక స్తోమత ఆధారంగా హెలికాప్టర్ సేవలు కూడా అందిస్తున్నాయి.