Goat escalator : మంచి పనులు చేసి కాదు.. గొప్ప పనులు చేసి అంతకన్నా కాదు.. జస్ట్ విచిత్రమైన.. విభిన్నమైన పనులు చేసి సమాజంలో సెలబ్రిటీలుగా మారాలనుకుంటున్న రోజులు ఇవి. పైగా సోషల్ మీడియా కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరూ తగ్గడం లేదు. ఏదో ఒక విచిత్రమైన పని చేయటం.. సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్ట్ చేయడం.. ఆ తర్వాత సెలబ్రిటీగా మారిపోవడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. అయితే దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఏం ప్రయోజనం? అనే ప్రశ్నలకు ఇక్కడ తావులేదు. ఎందుకంటే ఎవరైనా సరే గుర్తింపుని కోరుకుంటారు. గౌరవాన్ని ఆశిస్తారు. డబ్బు సంపాదనను ఇష్టపడతారు. కాబట్టి ఇక్కడ అలాంటి ప్రశ్నలకు తావులేదు.
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఒక్కొక్కరు ఒక్కో ప్రయత్నం చేస్తారు. ఎవరి ప్రయత్నం వారిది.. ఎవరి ఇబ్బంది కూడా వారిదే. ఇందులో కొంతమంది మాటలు మాట్లాడటం ద్వారా.. ఇంకా కొంతమంది తమ చేతల ద్వారా ఫేమస్ అవుతారు.. ఫేమస్ అవడంలో ఒక్కొక్కరిది ఒక్కో తీరు.. కొంతమంది రీల్స్ చేయడంలో విభిన్న తత్వాన్ని చూపిస్తారు. మరికొందరేమో నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదు అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. అందులో ఈ వీడియోలో కనిపిస్తున్న అక్క పీహెచ్ డీ చేసిందనుకుంటా .. రొటీన్ గా కాకుండా భిన్నంగా ఆలోచించింది. ఏకంగా తన మేకలను ఎక్స్ లేటర్ ఎక్కించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఆ మహిళను చూస్తే స్థితి మంతిరాలిగా కనిపిస్తోంది. ఒక చేతిలో బ్యాగు.. మరో చేతిలో రెండు మేకలను పట్టుకుని వెళ్తోంది. సాధారణంగా మేకలను అలా తీసుకెళ్లడం సాధ్యం కాదు. పైగా నగరంలో అస్సలు సాధ్యం కాదు. ఆమె సోషల్ మీడియాలో హైప్ సాధించడానికి ఇలా చేసినట్టు కనిపిస్తోంది. పైగా ఆ మేకలను పట్టుకోవడంలో కూడా ఆమె ప్రొఫెషనలిజాన్ని చూపించింది. వాస్తవానికి ఆ మహిళ కట్టుబొట్టుకు.. మేకలను పట్టుకున్న విధానానికి ఏమాత్రం సంబంధం లేదు.. ఆ మేకలను ఆమె ఎందుకు తీసుకెళ్తుందో తెలియ రాలేదు.
వాస్తవానికి నగరంలో మేకలను కబేలా ప్రాంతానికి తీసుకెళ్తుంటారు. అక్కడ వాటిని వధించి మాంసాన్ని విక్రయిస్తుంటారు. ఆ ప్రాంతాలు నగరానికి దూరంగా ఉంటాయి. అటువంటి వ్యాపారంలో పురుషులు మాత్రమే ఎక్కువగా ఉంటారు. మహిళలు అరుదుగా కనిపిస్తుంటారు. మరి ఈమె వాలకం చూస్తుంటే ఆ వ్యాపారం చేస్తున్నట్టు కనిపించడం లేదు. పైగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో మేకలను విక్రయించరు. మరి ఈమె ఎందుకు అక్కడికి వెళ్ళినట్టు? మేకలను ఎందుకు తీసుకువెళ్లినట్టు? అనే ప్రశ్నలు నెటిజన్లు వేస్తున్నారు.. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఆమె ఇలా చేసిందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
“నేటి కాలంలో ఫేమస్ అవ్వడానికి అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమె కూడా ఒక రాయివేసింది. కాకపోతే ఆ రాయిని తన మేకల ద్వారా వేసినట్టు కనిపిస్తోంది. డిఫరెంట్ గా ఉండడానికి ఇలా మేకలను ఎక్స్ లేటర్ ఎక్కించింది. ఆ మేకలు మొదట్లో ఎక్స్ లేటర్ ఎక్కడానికి ఇబ్బంది పడ్డాయి. ఆ తర్వాత ఆమె తాళ్లతో వాటిని గట్టిగా లాగడంతో ఎక్కాయి. సాఫీగా ప్రయాణించాయి.. ఇదంతా చూస్తుంటే సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఆ మహిళ చేసినట్టు కనిపిస్తోందని” నెటిజన్లు చెప్తున్నారు.
https://www.youtube.com/shorts/QyvDjEWS2uQ