https://oktelugu.com/

గొప్ప మనస్సు చాటుకున్న భిక్షగాడు.. 600 మంది అనాథల కోసం..?

సాధారణంగా ఎవరైన కుటుంబాలను, తమను తాము పోషించుకోవడానికి భిక్షాటన చేస్తారు. అయితే ఒక వ్యక్తి మాత్రం తన గొప్ప మనస్సును చాటుకున్నాడు. 600 మంది అనాథల కోసం అతను భిక్షాటన చేస్తున్నాడు. మనస్సు ఉన్న ఆ భిక్షగాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అనాథల కోసం భిక్షాటన చేస్తున్న ఆ వ్యక్తి దివ్యాంగుడు కావడం గమనార్హం. Also Read: యూపీలో దారుణ ఘటన.. చపాతీలు చల్లగా ఉన్నాయని తుపాకితో కాల్చిన కస్టమర్..? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 25, 2020 / 08:05 PM IST
    Follow us on


    సాధారణంగా ఎవరైన కుటుంబాలను, తమను తాము పోషించుకోవడానికి భిక్షాటన చేస్తారు. అయితే ఒక వ్యక్తి మాత్రం తన గొప్ప మనస్సును చాటుకున్నాడు. 600 మంది అనాథల కోసం అతను భిక్షాటన చేస్తున్నాడు. మనస్సు ఉన్న ఆ భిక్షగాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అనాథల కోసం భిక్షాటన చేస్తున్న ఆ వ్యక్తి దివ్యాంగుడు కావడం గమనార్హం.

    Also Read: యూపీలో దారుణ ఘటన.. చపాతీలు చల్లగా ఉన్నాయని తుపాకితో కాల్చిన కస్టమర్..?

    600 మంది అనాథల కోసం శ్రమిస్తున్న ఆ వ్యక్తి పేరు జోస్ ఇవానిల్డో లియాండ్రో డా సిల్వా. బ్రెజిల్ కు చెందిన ఇతను శాంతా క్లాజ్ వేషం వేసుకుని భిక్షాటన చేశాడు. అయితే అతని గొప్ప మనస్సు గురించి తెలిసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు సాధారణంగా ఇచ్చే మొత్తం కంటే అతనికి ఎక్కువ మొత్తం ఇచ్చారు. కొందరు అతని ఫోటోలను కెమెరాలో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతోంది.

    Also Read: భారతదేశంలో డ్రైవర్ లేని ట్రైన్.. ఎక్కడ రాబోతుందంటే..?

    కొందరు నెటిజన్లు ఆ బిక్షగాడు చేస్తున్న పనిని మెచ్చుకుంటూ ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు. మీడియాతో జోస్ ఇవానిల్డో మాట్లాడుతూ 600 మంది పిల్లలకు సహాయం చేయాలనే ఆలోచనతో తాను భిక్షాటన చేస్తున్నానని తెలిపారు. చాలామంది స్వార్థంతో కుటుంబ సభ్యులను కూడా నిర్లక్ష్యం చేస్తున్న తరుణంలో ఆ భిక్షగాడు మాత్రం అన్నం పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉండటం గమనార్హం.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    కుటుంబ సభ్యుల ఆదరణకు నోచోని వాళ్లు భిక్షాటన చేయడంతో ఆశ్చర్యం లేదు కానీ ఇలా ఇతరుల కోసం స్కేటింగ్‌బోర్డ్ సహాయంతో భిక్షాటన చేస్తూ ఆ భిక్షగాడు వందలాది మంది అనాథల పొట్ట నింపుతున్నారు.