Site icon OkTelugu

యూకేలో ఆరు లక్షల మందికి వ్యాక్సిన్ పంపిణీ

బ్రిటన్‌లో దాదాపు ఆరు లక్షల మందికిపైగా ఫైజర్‌ వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ను పంపిణీ చేసినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. ‘దేశ వ్యాప్తంగా 6,16,933 మందికి కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వడంలో కృషి చేసిన జాతీయ ఆరోగ్య సేవా సంస్థలకు ధన్యవాదాలు’అని ఆరోగ్య శాఖ పేర్కొంది. పంపిణీలో భాగంగా ఇంగ్లాండ్‌లో 5,21,000, స్కాట్లాండ్‌లో 56,000, వేల్స్‌లో 22,000, నార్త్‌ ఐర్లాండ్‌లో 16,000 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు సంబంధిత శాఖ వెల్లడించింది.

Exit mobile version