https://oktelugu.com/

Mallemala Entertainments: TRP రేటింగ్స్ కోసం దిగజారిపోయిన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్.. సుధీర్ రీ-ఎంట్రీకి కారణం అదేనా?

Mallemala Entertainments: బుల్లితెర పై ఎంటర్టైన్మెంట్ షోస్ కి ట్రెండ్ లేపిన సంస్థ మల్లెమాల సంస్థ. ఈటీవీ లో ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ ని వీళ్ళు గత పదేళ్ల నుండి నిర్వహిస్తూనే ఉన్నారు. వీళ్ళు ప్రసారం చేసే షోస్ బాగా క్లిక్ అవ్వడం తో ఇతర ఛానెల్స్ వారు కూడా అదే పద్దతిని ఫాలో అయ్యి సక్సెస్ సాధించారు. ముఖ్యంగా జబర్దస్త్ షో గురించి మనం చెప్పుకోవాలి. బుల్లితెర మీద ఈ కామెడీ షో ఒక ప్రభంజనం, […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 21, 2022 / 12:47 PM IST
    Follow us on

    Mallemala Entertainments: బుల్లితెర పై ఎంటర్టైన్మెంట్ షోస్ కి ట్రెండ్ లేపిన సంస్థ మల్లెమాల సంస్థ. ఈటీవీ లో ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ ని వీళ్ళు గత పదేళ్ల నుండి నిర్వహిస్తూనే ఉన్నారు. వీళ్ళు ప్రసారం చేసే షోస్ బాగా క్లిక్ అవ్వడం తో ఇతర ఛానెల్స్ వారు కూడా అదే పద్దతిని ఫాలో అయ్యి సక్సెస్ సాధించారు. ముఖ్యంగా జబర్దస్త్ షో గురించి మనం చెప్పుకోవాలి. బుల్లితెర మీద ఈ కామెడీ షో ఒక ప్రభంజనం, ఈ షో ని చూసి ఎన్నో వందల షోలు పుట్టుకొచ్చాయి. అంతే కాకుండా ఈరోజు టాలీవుడ్ లో టాప్ మోస్ట్ కమెడియన్స్ గా కొనసాగుతున్న ఎంతో మంది జబర్దస్త్ షో ద్వారానే ప్రారంభమైయ్యారు. అయితే గత కొంత కాలం క్రితం ఈ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ ని సంపాదించిన ఎంతో మంది కమెడియన్స్ ఒక్కకారిగా షో ని వదిలి వెళ్లిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే. సుడిగాలి సుధీర్ ఈటీవీ ని వదిలి మా టీవీ కి షిఫ్ట్ అయ్యి చాలా కాలమే అయ్యింది.

    sudheer

    Also Read: Kartika Deepam serial: సినిమాగా తెరకెక్కబోతున్న కార్తీక దీపం సీరియల్.. వంటలక్క అభిమానులకు ఇక పండగే

    ఇక ఆ తర్వాత యాంకర్ అనసూయ కూడా ఈ షో ని వదిలి ఇటీవలే వెళ్లిపోవడమే కాకుండా కొన్ని వివాదాస్పద కామెంట్స్ కూడా చేసింది. జబర్దస్త్ షో లో చాలా అవమానాలు ఎదుర్కొన్నానని, అందుకే ఆ షో నుండి బయటకి వచ్చేసాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్, జబర్దస్త్ షో లేకపోతే అసలు నువ్వు ఎవరివి అంటూ తిడుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈమెతో పాటుగా సుడిగాలి సుధీర్ కూడా ఈటీవీ లో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. ఈటీవీ ఛానల్ 27 సంవత్సరాలు వార్షికోత్సవం ని పురస్కరించుకొని ఇటీవలే ఒక ప్రత్యేకమైన షో ని నిర్వహించారు.

    sudheer

    Also Read: Samantha: ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోయిన్‌ గా నిలిచిన సమంత.. కారణం అదే !

    ఈ షో లో సుడిగాలి సుధీర్ మరియు యాంకర్ అనసూయ కూడా పాల్గొనడం చూసి అందరూ షాక్ కి గురైయ్యారు. ఒక్కసారి మల్లెమాల ఎంటెర్టైమెంట్స్ నుండి బయటకి వెళ్తే మళ్ళీ తిరిగి ఆ క్యాంపు లో గడప కూడా తొక్కనివ్వరు. ఇది ఇప్పటికే ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ విషయం లో జరిగింది. కానీ సుడిగాలి సుధీర్ మరియు యాంకర్ అనసూయ ని మాత్రం మళ్ళీ ఆహ్వానించారు. అంటే విలువలు పాటించకుండా TRP రేటింగ్స్ కోసం క్రేజ్ ఉన్న ఆర్టిస్టుల చుట్టూ తిరుగుతారా. మిగతా వాళ్ళు ఏమి పాపం చేసారంటూ నెటిజెన్స్ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ పై విరుచుకుపడుతున్నారు.