Homeఆంధ్రప్రదేశ్‌Eenadu: సండే స్పెషల్: ఇప్పటికీ ఆ పత్రికే నెంబర్ వన్.. ఇది ఎలా సాధ్యం?

Eenadu: సండే స్పెషల్: ఇప్పటికీ ఆ పత్రికే నెంబర్ వన్.. ఇది ఎలా సాధ్యం?

Eenadu: పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక సమయంలో వార్తలు చదువుతూనే ఉంటాం. సమాచారం మంచిదైనా, చెడ్డదైనా తెలుసుకోవాలనే ఉత్సుకత అనేది మన జీవితంలో ఒక భాగం కాబట్టి.. ఒకప్పుడు అంటే తెలుగు నాట రెండు, మూడు పత్రికలు ఉండేవి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాలోనూ పెడ పోకడలు దాపురించాయి. అన్నింటికీ అతీతంగా ఉండాల్సిన యాజమాన్యాలు వ్యాపార అభివృద్ధికో, రాజకీయ ప్రయోజనాల కోసమో, ఓ వర్గం మెప్పు పొందే వార్తలనే ప్రచురిస్తున్నాయి. జర్నలిస్టులు అనేవారు యాజమాన్యాల కిందే పని చేస్తారు కాబట్టి వారు చెప్పిందే వినాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలుగు నాట లెక్కకు మిక్కిలి పత్రికలు, అదే స్థాయిలో న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఆ న్యూస్ ఛానల్స్ ట్యాంపరింగ్ కు అతితం కావు. ఆ మధ్య రిపబ్లిక్ టీవీ విషయంలో ఏ స్థాయిలో గాయి గాయి జరిగిందో చూశాం కదా! టీవీ9 కూడా ట్యాంపరింగ్ కు పాల్పడిందనే ఆరోపణలు లేకపోలేదు. న్యూస్ ఛానళ్ళ మంచి, చెడు కొలవడానికి బార్క్ అనే సంస్థ ప్రతివారం రేటింగ్స్ ఇస్తూ ఉంటుంది. సరే ఆ విషయం పక్కన పెడితే.. పత్రికలు, వాటి అనుబంధ సైట్ల పరిస్థితి ఏమిటి? పాఠకుడు దేనిని విశ్వసిస్తున్నాడు? ఎందుకు? ఇవి ఆసక్తికరమైన ప్రశ్నలే. గతంలో పేపర్ స్థాయిని, అందులో ప్రచురితమయ్యే వార్తా ప్రమాణాలను, సర్క్యులేషన్ ను నిర్దేశించేందుకు ఏబీసీ ( ఆడిట్ బ్యూరో కౌన్సిల్) అనే ఒక సిస్టం ఉండేది. ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగానే యాడ్స్ వచ్చేవి. కోవిడ్ వల్ల ఏబీసీ సంస్థ మనుగడ నిలిచిపోయింది. వార్తాపత్రికలకు పాఠకుల్లో ఎలాంటి ఆదరణ ఉందో చెప్పే ఐఆర్ఎస్ సంస్థ కూడా ఇప్పుడు వెలుగులో లేదు. అది ఎప్పుడు బయటికి వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి.

Eenadu
Eenadu

వెబ్సైటు ట్రాఫిక్ లో రిఫ్లెక్ట్

కరోనా తర్వాత అన్ని పత్రికలు తమ సర్క్యులేషన్ ను తగ్గించుకున్నాయి. చాలామంది ఉద్యోగులను ఇంటికి పంపాయి. ప్రస్తుతం మార్కెట్లో ప్రింట్ మీడియాకి సానుకూల పరిస్థితులు లేకపోవడం, పేపర్, ఇంకు ఖర్చులు నానాటికి పెరిగిపోతుండటం వల్ల యాజమాన్యాలు డిజిటల్ వైపు మళ్లాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటంతో నెట్ సర్ఫింగ్ అనేది సర్వసాధారణం అయిపోయింది. పైగా డిజిటల్ మార్కెట్లో భారీగా లాభాలు కళ్లజూసే అవకాశం ఉండటంతో మీడియా సంస్థలు అనుబంధ సైట్లను ప్రారంభించాయి. ఆ ఏబిసి, ఐఆర్ఎస్ సంస్థలు మనుగడలో లేకపోవడంతో పత్రికల స్థాయిని నిర్దేశించేందుకు, పాఠకుల ఆదరణ ఎలా ఉందో చెప్పేందుకు వాటి వెబ్ సైట్ ట్రాఫిక్ అంశాలే ఇప్పుడు ప్రామాణికంగా నిలుస్తున్నాయి. గతంలో అలెక్సా అనే ఒక ర్యాంకింగ్ సంస్థ ఉండేది. ఏ సైట్ ర్యాంకు ఎంతో చెప్పేది. ఆ తర్వాత దాని అంకెల్ని ట్యాంపర్ ( ట్వీక్) చేయడం సులభం అయిపోయింది. ఫలితంగా అది ఇచ్చే ర్యాంకులపై కూడా నమ్మకం పోయింది. ప్రస్తుతం అది మొత్తానికి ఆగిపోయింది. నేపథ్యంలో “సిమిలర్ వెబ్” అనే వెబ్సైట్ ర్యాంకింగులు, వెబ్సైట్ విశ్లేషణ ను వెల్లడించే సైట్ తెలుగు పత్రికల్లో పెరుగు ఏదో, మజ్జిగ ఏదో తేల్చేసింది. ఇందులో ఏబీసీ, ఐఆర్ఎస్, అలెక్సా కూడా అనే సంస్థలు లేవు. వాటి అభూత కల్పనలు అస్సలు లేవు. “పానీకి పానీ దూద్ కా దూద్” అన్నట్టు.

Also Read: Deepak Hooda: లక్కీ దీపక్ హుడా.. అతడుంటే టీమిండియా గెలిచినట్టే.. వరుసగా 16వ విజయం

నాలుగు పత్రికల ర్యాంకులు ఇవి

తెలుగులో ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ ప్రధానాపత్రికలుగా చలామణి అవుతున్నాయి. వెలుగు ఈ కేటగిరీలోకి రావడానికి నానా ప్రయాసపడుతోంది. సిమిలర్ వెబ్ అనే సైట్ గత మే నుంచి జూలై వరకు అన్ని ఈ నాలుగు న్యూస్ పేపర్ల వెబ్ సైట్లను పరిశీలించింది. ఇందులో ఆంధ్రజ్యోతి 5.3 మిలియన్లు, ఈనాడు 24.4 మిలియన్లు, సాక్షి 5.9 మిలియన్ల విజిట్స్ సాధించాయి. ఈ కేటగిరిలో నమస్తే తెలంగాణ ముక్కీ మూలిగి ఒక మిలియన్ లోపే విజిట్స్ ను సంపాదించింది. ఈ లెక్క ప్రకారం ఈనాడు మిగతా పేపర్లు అన్నింటికంటే ముందంజలో ఉంది అని అర్థమవుతోంది. ఆంధ్రజ్యోతి, సాక్షి …ఈనాడు వెబ్సైట్ లో పావు వంతు విజిట్స్ ని కూడా సంపాదించలేనంత స్థాయిలో వెనుకబడిపోయాయి. ఇదీ వాటి సత్తా, పాఠకుల్లో వాటికి ఉన్న ఆదరణ. ఇక నమస్తే గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అసలు కంపారిజన్ లోకి తీసుకునే స్థాయి కూడా కాదు దానిది.

Eenadu
Eenadu

డెస్క్ టాప్ విజిట్ లోనూ

స్మార్ట్ ఫోన్ లోనే కాకుండా.. డెస్క్ టాప్ విజిట్ లో కూడా ఈనాడే ముందంజలో ఉంది. ఇప్పటికీ ఇళ్లల్లో ఆడవాళ్లు, వృద్ధులు ఈనాడు సైట్ ని ఎక్కువగా చూస్తున్నారని ఓ అంచనా! ఇక వీటిల్లో ర్యాంకుల విషయానికి వస్తే ఈనాడు 151, ఆంధ్రజ్యోతి 379, సాక్షి 351.. ఈ లెక్కను చూస్తే ఈనాడు మిగతా పేపర్లతో పోలిస్తే ముందంజలో ఉంది. ఇవే గాక నెలవారి విజిటర్స్, రోజువారి విజిటర్స్, బౌన్స్ రేట్, విజిట్ డ్యూరేషన్, పేపర్ పేజీల డ్యూరేషన్.. ఇలా ఏ అంశాలు చూసుకున్నా మిగతా పేపర్లతో పోలిస్తే ఈనాడే తోపు. పేజీల విజిట్, విజిట్ డ్యూరేషన్ లో సాక్షి కొంతలో కొంత నయం. ఇక బౌన్స్ రేట్ లో అయితే ఆంధ్రజ్యోతి పరిస్థితి మరీ ఘోరం. ఈ పత్రికల్లో న్యూట్రల్ స్టాండ్ అనేది కాగడ వేసి వెతికినా దొరకదు. ఆంధ్రజ్యోతి చంద్రబాబు భజన చేస్తుంది. తెలుగు దేశం కోసం నడి బజారు లో పోతరాజు లాగా కొరడాలతో కొట్టుకుంటుంది. ఈనాడు కూడా చంద్రబాబు కోసం ఏమైనా చేస్తుంది. అలాగని ఆంధ్రజ్యోతిలాగా బట్టలిప్పి బజార్లో నిలబడదు. అది తలుపు చాటున ఉండి కన్నుకొట్టి లోపలికి పిలిచే రకం. ఇక సాక్షిది కూడా బరిబాతల వ్యవహారమే. జగన్ దానిని ఎప్పుడో పట్టించుకోవడం మానేశాడు. ఇక ఈ జాబితాలోకి నమస్తే తెలంగాణ ను తీసుకోకపోవడమే బెటర్. ఎందుకంటే దానికి టిఆర్ఎస్ సోది తప్ప ఇంకో వార్త పట్టదు. ఏతావాతా చెప్పొచ్చేది ఏంటంటే తెలుగు నాట జనం వార్తా పత్రికలను అంతగా విశ్వసించడం లేదు. పత్రికల యాజమాన్యాలు తాము పూసుకున్న రాజకీయ రంగులకు అనుగుణంగా వార్తలు రాస్తున్నాయి కాబట్టి పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదు. అయితే ఇప్పటికీ న్యూట్రల్ ముసుగు వేసుకొని నేను పతివ్రతను అని చెప్పే ఈనాడునే ఎంతో కొంత నమ్ముతున్నారు.

Also Read:CPI Supports To TRS: సూది, దబ్బుణం పార్టీలు ఇక మారవ?

 

రామ్ చరణ్ కి షాక్ మీద షాక్ ఇస్తున్న శంకర్ | Director Shankar Gaves Shock To Ram Charan | #RC15

 

నాగార్జునకు పైసలే ముఖ్యం పరువు కాదు | Criticisms Are Coming On Nagarjuna | Oktelugu Entertainment

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version