Bimbisara Collections: బింబిసార’ 17 రోజుల కలెక్షన్స్.. సంబరాల్లో నందమూరి అభిమానులు.. ఇంతకీ ఎన్ని కోట్లు లాభమో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Bimbisara Collections: ‘బింబిసార’ సినిమా రిలీజ్ అయ్యి మూడు వారాలు అవ్వబోతున్నాయి. అయినా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ విషయంలో కళ్యాణ్ రామ్ తగ్గడం లేదు. మొత్తమ్మీద నందమూరి కల్యాణ్‌ రామ్‌ తన రేంజ్ ఏమిటో ఈ సారి ఘనంగా నిరూపించుకున్నాడు. ఆయన హీరోగా వచ్చిన ఈ చిత్రం డబుల్ బ్లాక్‌ బస్టర్ హిట్ ను సాధించింది. అసలు ఈ సినిమా ఈ స్థాయి హిట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. పైగా కళ్యాణ్ రామ్ పై జాలీ కూడా […]

Written By: Shiva, Updated On : August 21, 2022 12:38 pm
Follow us on

Bimbisara Collections: ‘బింబిసార’ సినిమా రిలీజ్ అయ్యి మూడు వారాలు అవ్వబోతున్నాయి. అయినా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ విషయంలో కళ్యాణ్ రామ్ తగ్గడం లేదు. మొత్తమ్మీద నందమూరి కల్యాణ్‌ రామ్‌ తన రేంజ్ ఏమిటో ఈ సారి ఘనంగా నిరూపించుకున్నాడు. ఆయన హీరోగా వచ్చిన ఈ చిత్రం డబుల్ బ్లాక్‌ బస్టర్ హిట్ ను సాధించింది. అసలు ఈ సినిమా ఈ స్థాయి హిట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. పైగా కళ్యాణ్ రామ్ పై జాలీ కూడా చూపించారు. కథల ఎంపిక కళ్యాణ్ రామ్ కి తెలియదు అని కూడా విమర్శలు కూడా చేశారు. కానీ.. తన నిర్ణయమే కరెక్ట్ అని కళ్యాణ్ రామ్ నిరూపించాడు.

kalyan ram

ముఖ్యంగా ఈ చిత్రంలో క‌ల్యాణ్ రామ్ కత్తి ప‌ట్టుకుని చేసిన విన్యాసాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. అలాగే సినిమాలోని బెస్ట్ విజువల్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. దాంతో, బాక్సాఫీస్ దగ్గర బింబిసార‌ తన ఏక ఛాత్రాధిప‌త్యాన్ని పరిపూర్ణంగా ఇంకా ప్రదర్శిస్తూనే ఉంది. ఇంతకీ, ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి ?, అసలు నిర్మాతకు ఏ స్థాయిలో లాభాలు వచ్చాయి ? చూద్దాం రండి.

Also Read: Kartika Deepam serial: సినిమాగా తెరకెక్కబోతున్న కార్తీక దీపం సీరియల్.. వంటలక్క అభిమానులకు ఇక పండగే

ముందుగా ‘బింబిసార’ సినిమా 17th డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

నైజాం 9.91 కోట్లు

సీడెడ్ 6.62 కోట్లు

ఉత్తరాంధ్ర 4.15 కోట్లు

ఈస్ట్ 1.92 కోట్లు

వెస్ట్ 1.56 కోట్లు

గుంటూరు 2.09 కోట్లు

కృష్ణా 1.75 కోట్లు

నెల్లూరు 0.98 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 17th డేస్ కలెక్షన్స్ కు గానూ ‘బింబిసార’ రూ. 28.04 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. రూ. 56.08 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా 2.09 కోట్లు

ఓవర్సీస్ 2.31 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా 17th డేస్ కలెక్షన్స్ కు గానూ ‘బింబిసార’ రూ. 33.45 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 66:90 కోట్లను కొల్లగొట్టింది

kalyan ram

‘బింబిసార’ చిత్రానికి రూ.20.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఓవరాల్ గా ప్రస్తుత కలెక్షన్స్.. అలాగే బుకింగ్స్ ను బట్టి అంచనా వేస్తే… ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ లాభాలను సాధించింది. నందమూరి అభిమానుల్లో ఎప్పుడు లేనంత యూనిటీ ఇప్పుడు ఈ సినిమా కోసం కనిపిస్తోంది. అదే ‘బింబిసార’ కు బాగా ప్లస్ అయ్యింది. మొత్తానికి బింబిసార చిత్రం డబుల్ బ్లాక్‌ బస్టర్ హిట్ ను సాధించింది. ఇపుడున్న అంచనాల ప్రకారం అన్నీ రైట్స్ కలుపుకుని ఈ సినిమాకి దాదాపు 37 కోట్లు లాభం వచ్చే ఛాన్స్ లు ఉన్నాయని తెలుస్తోంది.

Also Read:Samantha: ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోయిన్‌ గా నిలిచిన సమంత.. కారణం అదే !

Tags