https://oktelugu.com/

Pawan Kalyan : సినిమాలపై సంచలన నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్?

Pawan Kalyan : 'హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రానికి విడుదల తేదీని కూడా ఈమధ్యనే ప్రకటించేసారు. మే 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పవన్ కళ్యాణ్ సన్నివేశాల షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. అవి పూర్తి అవ్వడానికి వారం రోజుల సమయం కావాలి. కానీ పవన్ కళ్యాణ్ ఆ వారం రోజుల డేట్స్ ని కేటాయించలేకపోతున్నాడు.

Written By: , Updated On : March 25, 2025 / 09:50 PM IST
Pawan Kalyan

Pawan Kalyan

Follow us on

Deputy CM Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంత బిజీ గా గడుపుతున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆయన అభిమానులకు ఒక పక్క తమ హీరో రాజకీయంగా పెద్ద రేంజ్ కి వెళ్తున్నందుకు ఆనందపడాలో, లేకపోతే సినిమాలకు దూరం అవుతున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆయన చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో రెండు సినిమాలు చిత్రీకరణ చివరి దశలో ఉన్నాయి. ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రానికి విడుదల తేదీని కూడా ఈమధ్యనే ప్రకటించేసారు. మే 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పవన్ కళ్యాణ్ సన్నివేశాల షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. అవి పూర్తి అవ్వడానికి వారం రోజుల సమయం కావాలి. కానీ పవన్ కళ్యాణ్ ఆ వారం రోజుల డేట్స్ ని కేటాయించలేకపోతున్నాడు.

Also Read : పవన్ కళ్యాణ్ గురువు కన్ను మూత..శోకసందంలో సినీ పరిశ్రమ!

ఇంత బిజీ గా ఉన్నప్పుడు ఆయన భవిష్యత్తులో ఇంకేమి సినిమాలు చేయగలడు?, ఓజీ తర్వాత సినిమాలను పూర్తి గా ఆపేస్తాడేమో అని అనుకున్నారు. కానీ రీసెంట్ గా ఆయన ఒక ప్రముఖ తమిళ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సినిమాల ప్రస్తావన గురించి చెప్పుకొచ్చాడు. రిపోర్టర్ పవన్ కళ్యాణ్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు ఒకపక్క రాజకీయాల్లో విజయవంతంగా కొనసాగుతూనే, మరోపక్క సినిమాలు చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతారా?, లేదా మధ్యలోనే సినిమాలను ఆపేస్తారా?’ అని అడుగుతాడు. దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తూ ‘నాకు డబ్బులు అవసరం ఉన్నంత వరకు సినిమాలు చేస్తూనే ఉంటాను. నాకు తెలిసిన పని అదొక్కటే. ఇతర రాజకీయ నాయకులూ లాగా నాకు ఎలాంటి సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు. కాకపోతే నా పరిపాలనకు ఎలాంటి అడ్డంకి లేకుండా సినిమాలను చేయడానికి ప్లాన్ చేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలకు అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరంగా పవన్ కళ్యాణ్ గత నెల రోజుల నుండి బాధపడుతున్నాడు. వెన్ను నొప్పి చాలా తీవ్రంగా బాధించడంతో ఆయన హైదరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటున్నాడు. రాజకీయాల్లో ఫుల్ బిజీ గా ఉండడం వల్ల, ఆయన తన లుక్స్ నుండి షేప్ అవుట్ అయిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు జిమ్ వర్కౌట్స్ చేస్తున్నాడు. ఏప్రిల్ 3 నుండి 10వ తేదీ వరకు ఆయన ‘హరి హర వీరమల్లు’ కోసం డేట్స్ కేటాయించినట్టు తెలుస్తుంది. ఇటీవలే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసారు. ఏప్రిల్ 23 వ తేదీలోపు మొదటి కాపీ ని సిద్ధం చేసేలా ప్లానింగ్ చేసుకుంటున్నారు. బిజినెస్ కూడా ఉగాది నుండి మొదలు పెట్టబోతున్నారట. అంటే చెప్పినట్టుగానే మే9న ఈ సినిమాని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు మేకర్స్.

Also Read : పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కాంబోలో మిస్ అయిన మల్టీ స్టారర్ మూవీ…డైరెక్టర్ ఎవరంటే..?