https://oktelugu.com/

Yuzvendra Chahal: అప్పటినుంచి ఎడం పెరిగిందట.. అందువల్లే విడాకులట..

Yuzvendra Chahal నేటి కాలంలో సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం పరిపాటిగా మారింది. ఉన్నంతకాలం కలిసి ఉండడం.. తేడాలు వస్తే విడిపోవడం అలవాటుగా మారింది.

Written By: , Updated On : March 23, 2025 / 11:52 AM IST
Yuzvendra Chahal (2)

Yuzvendra Chahal (2)

Follow us on

Yuzvendra Chahal: గత ఏడాది హార్థిక్ పాండ్యా – నటాషా విడాకులు తీసుకోవడం సంచలనంగా మారింది.. ఆ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ దంపతులు కూడా విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించడం చర్చకు దారి తీసింది. ఇప్పుడు ఈ జాబితాలో టీమ్ ఇండియా యువ స్పిన్ బౌలర్ యజువేంద్ర చాహల్ – ధనశ్రీ దంపతులు ఉండడం కూడా షాక్ కు గురిచేస్తోంది. చాహల్ – ధనశ్రీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కంటే ముందు వారిద్దరు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న కొద్ది రోజుల వరకు వారు వైవాహిక జీవితాన్ని ఆస్వాదించారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. తమకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను అభిమానులతో పంచుకున్నారు. ప్రేమ పక్షుల్లాగా విహరించారు. ధనశ్రీ ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్ కావడంతో.. ఆమె జడ్జిగా వ్యవహరించిన ఓ డ్యాన్స్ రియాల్టీ షోలో కూడా చాహల్ పాల్గొన్నాడు. ఆ షో లో డాన్స్ చేసిన ధనశ్రీ.. చాహల్ ను అమాంతం ఎత్తుకుంది. అప్పట్లో ఆ వీడియో సంచలనం సృష్టించింది.. వారి అన్యోన్యతను చూసి చాలామంది మెచ్చుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ఏకంగా మిలియన్ వ్యూస్ మార్క్ సొంతం చేసుకుంది. అయితే కొంతకాలానికి వారిద్దరు విడివిడిగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

Also Read: విరాట్ ట్రెండ్ ఫాలో అవ్వడు.. ట్రెండ్ సెట్ చేస్తాడు.. వైరల్ వీడియో

అప్పటినుంచి విడిగా ఉంటున్నారట

కారణం తెలియదు గాని.. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు గాని.. గత ఏడాది జూన్ నుంచి వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయని తెలుస్తోంది. ధనశ్రీ ప్రొఫెషనల్ డాన్సర్ కావడంతో చాహల్ ఆమెను మొదట్లో ప్రోత్సహించాడు. అయితే ఆమె తన వ్యవహార శైలిని విభిన్నంగా మార్చుకోవడంతో తట్టుకోలేకపోయాడు. అందువల్లే ఇద్దరు విడిగా ఉండడం మొదలుపెట్టారట.. ఆ తర్వాత విభేదాలు అంతకంతగా పెరగడంతో పరిస్థితి విడాకుల దాకా దారి తీసిందట. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు మధ్యలోకి రంగ ప్రవేశం చేసినప్పటికీ పరిస్థితి ఏమాత్రం మారలేదట. ఇద్దరు కూడా ఎవరికివారుగా ఉండాలని నిర్ణయించుకున్నారట. దీంతో విడాకులు అనివార్యమయ్యాట. అయితే వీరిద్దరు విడాకులకు సంబంధించి మొదట్లో చాహల్ భరణంగా 60 కోట్లు చెల్లించాలని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ అవాస్తవాలని తేలింది. విడాకులను అధికారికంగా కోర్టు మంజూరు చేయకముందే చాహల్ ఆర్జే మహ్వేష్ తో కలిసి దుబాయ్ వెళ్లిపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా, న్యూజిలాండ్ ఆడిన ఫైనల్ మ్యాచ్ ను వీక్షించాడు.. అయితే ఆమెతో అతడు ప్రేమలో ఉన్నాడని జాతీయ మీడియా కోడై కూస్తోంది. మరోవైపు ధనశ్రీ కూడా తన ధన శైలిలో సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతోంది.. కొన్ని విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతోంది. ఎలాంటి విమర్శలు వచ్చినా దూసుకుపోవాలని ఇటీవల తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. దీనినిబట్టి విడాకులు అనంతరం తన జీవితంలో కొత్త పేజ్ మొదలవుతుందని ధనశ్రీ చెప్పకనే చెప్పింది.