
YS Avinash Reddy: అదొక హైప్రొఫైల్ హత్యకేసు. అప్పట్లో సంచలనం రేపింది. హత్య ఏపీలో జరిగింది. కానీ విచారణ ఇప్పుడు తెలంగాణలో జరుగుతోంది. అనుమానితులను ఒక్కొక్కరిగా విచారిస్తోంది. విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెస్తోంది. సీబీఐ దూకుడుతో కేసు క్లైమాక్స్ కు వచ్చినట్టు కనిపిస్తోంది. నేరస్థులెవరో తేలిపోనుంది. ఇంతకీ వైఎస్ వివేకా హత్య కేసులో ఏం జరుగుతోంది ? సీబీఐ ఏ మేరకు వేగవంతం చేసింది ? ఇప్పుడు తెలుసుకుందాం.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఏపీలో విచారణ నత్తనడకన సాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తెలంగాణకు విచారణ నిమిత్తం బదిలీ చేసింది. దీంతో సీబీఐ దూకుడు పెంచింది. కేసులో వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే జగన్ సతీమణి భారతి పీఏ నవీన్, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని విచారించింది. అంతకు మునుపే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించింది. కానీ ఇప్పుడు మరోసారి విచారణకు రావాలంటూ వైఎస్ అవినాశ్ రెడ్డికి నోటీసులు పంపింది. ఈసారి అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా నోటీసులు పంపింది. అవినాష్ రెడ్డిని హైదరాబాద్ రావాలని పేర్కొనగా.. భాస్కర్ రెడ్డికి మాత్రం చాయిస్ ఇచ్చింది. భాస్కర్ రెడ్డి ఎక్కడ హాజరవుతానంటే అక్కడ సీబీఐ విచారిస్తుంది.
అవినాష్ రెడ్డి తండ్రికి చాయిస్ ఇచ్చి.. అవినాష్ ను మాత్రం హైదరాబాద్ రావాలని సీబీఐ ఆదేశించింది. దీని పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయనుందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా ఇదే తరహాలో ప్రచారం జరిగింది. అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు .. సీబీఐ అధికారులు కడప బయల్దేరారు అంటూ గతంలో వార్తలు వచ్చాయి. కానీ అదేం లేదని తేలిపోయింది. ఇప్పుడు మళ్లీ అలాంటి ప్రచారం జరుగుతోంది. వైఎస్ భాస్కర్ రెడ్డికి చాయిస్ ఇచ్చి.. అవినాష్ కు ఇవ్వకపోవడం పైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీబీఐ అవినాష్ కేంద్రం విచారించే అవకాశం కనిపిస్తోంది. కేసులో అవినాష్ కీలక వ్యక్తి అని సీబీఐ నమ్ముతున్నట్టు తెలుస్తోంది. అందుకే రెండోసారి విచారణకు పిలిచినట్టు ప్రచారం జరుగుతోంది.
వైఎస్ వివేకా హత్య కేసులో రెండు విరుద్దమైన ప్రకటనలు అనుమానం కలిగిస్తున్నాయి. వైఎస్ వివేకా హత్య జరిగిన విషయంలో ఉదయం పనిమనిషి చూసేంత వరకు ఎవరికీ తెలియదని ప్రకటన చేశారు. కానీ సీబీఐకు అందిన సమాచారం మేర

కు.. తెల్లవారుఝామున మూడు గంటలకే అవినాష్ రెడ్డికి ఈ విషయం తెలిసినట్టు తెలుస్తోంది. అందుకే అవినాష్ మూడు గంటల నుంచే జగన్ ఓఎస్డీ, భారతీ పీఎలకు ఫోన్ చేసినట్టు సీబీఐ అనుమానిస్తోంది. హత్య విషయం ఉదయం వరకు ఎవరికీ తెలియనప్పుడు.. తెల్లవారుఝామున నుంచే అవినాష్ రెడ్డి ఎందుకు ఫోన్లు చేశాడు ? హత్య విషయం అవినాష్ రెడ్డికి ఎలా తెలిసిందన్న కోణంలో సీబీఐ విచారిస్తోంది. సీబీఐ దూకుడు ఇదే విధంగా కొనసాగితే.. మరో నెలలో కేసు తేలనుందని తెలుస్తోంది