YouTuber Sanju: కారులో స్విమ్మింగ్ పూల్.. యూట్యూబర్ తిక్క కుదిర్చిన ఎంవీడీ

మే 29న సంజు, అతడి స్నేహితుడు కారులో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ ను బయటి సమాజానికి ప్రదర్శించాడు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు తెగ తాపత్రయపడ్డాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 16, 2024 2:27 pm

YouTuber Sanju

Follow us on

YouTuber Sanju: తన కారులో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుచేసిన యూ ట్యూబర్ తిక్కను మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ కుదిర్చింది. కేరళలోని టీఎస్ సంజు అలియాస్ సంజు అనే యూట్యూబర్ ఉన్నాడు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు తన కారులో “ఆవేశం” సినిమా ను స్ఫూర్తిగా తీసుకొని.. అందులో ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసుకున్నాడు. రద్దీగా ఉండే రోడ్డులో ప్రయాణించి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడు. సంజు తో పాటు కారు నడిపిన అతని స్నేహితుడు సూర్యనారాయణన్ పై కూడా కేసు నమోదయింది. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మాత్రమే కాదు సంజు పలుమార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడు. యూట్యూబ్ లో అతడి పాత వీడియోలను పరిశీలించిన అలప్పుజ ఎన్ ఫోర్స్ మెంట్ ట్రాన్స్ ఫోర్ట్ భాగం అధికారులకు ఆ విషయం తెలిసింది. దీంతో అతనిపై కేసు నమోదు చేశారు.

మే 29న సంజు, అతడి స్నేహితుడు కారులో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ ను బయటి సమాజానికి ప్రదర్శించాడు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు తెగ తాపత్రయపడ్డాడు. కారులో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ, కొబ్బరి నీళ్లు తాగుతూ కనిపించాడు. కారులో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేశాడు. ఆ సమయంలో ఆ కారు రద్దీగా ఉండే రహదారి మీదుగా వెళ్ళింది. డ్రైవర్ సీట్, ఇంజన్ లోకి నీరు రావడంతో.. సంజు, తడి స్నేహితులు కారును మధ్యలోనే నిలిపివేశారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. సంజు వ్యవహారంపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో.. కేరళ మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ సంజును పిలిపించడంతో మే 29 ఎన్ ఫోర్స్ మెంట్ రోడ్డు ట్రాన్స్ ఫోర్ట్ ఆఫీసర్ ఎదుట హాజరయ్యాడు. సంజు తోపాటు ఆదర్శ స్నేహితులు సూర్యనారాయణన్, అభిలాష్ గోపి, స్టాన్లీ క్రిస్టోఫర్ పై కూడా కేసులో నమోదు చేశారు. ప్రమాదకరమైన డ్రైవింగ్, ఇతర నేరాల కింద వారిపై మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ కేసులు నమోదు చేసింది.. వారికి శిక్ష కూడా విధించింది.

శిక్షలో భాగంగా సంజు, అతడి స్నేహితులు స్వచ్ఛంద సేవ చేయించింది. మలప్పురంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ లో శిక్షణ ఇచ్చింది. అనంతరం కేరళ మోటర్ వెహికల్ డిపార్ట్మెంట్ సంజు డ్రైవింగ్ లైసెన్స్ జీవితకాలం రద్దు చేసింది. అతడి స్నేహితుడి డ్రైవింగ్ లైసెన్స్ పై ఏడాది పాటు నిషేధం విధించింది. “నేర కార్యకలాపాలకు వాహనాలు ఉపయోగిస్తే చూస్తూ ఊరుకోలేమని” మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రకటించారు. సంజు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కావడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఫేమస్ అయ్యేందుకు ఇలాంటి చవక బారు పనులు చేస్తే, ఫలితం ఇలానే ఉంటుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.