Vande Bharat Metro Train: త్వరలో అందుబాటులోకి ‘వందే భారత్ మెట్రో’.. తక్కువ దూరం హై స్పీడ్ ట్రైన్..

‘వందే భారత్-ట్రైన్ 18’ పేరిట రైలును తీసుకువచ్చారు. తేలికపాటి హై స్పీడ్ రైలు అయిన ఇది ఎక్కువ వేగంతో దూసుకెళ్తుంది. ఇందులో ప్రయాణికులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను అమర్చారు.

Written By: Neelambaram, Updated On : June 16, 2024 2:38 pm

Vande Bharat Metro Train

Follow us on

Vande Bharat Metro Train: మోడీ ప్రభుత్వం ఏర్పడిన 2014 నుంచే భారతీయ రైల్వే వ్యవస్థను సమూలంగా మార్చాలని నిర్ణయించారు. అప్పటి నుంచి రైల్వేకు బడ్జెట్ లో కొంత భాగం కేటాయించి పనులను వేగంగా చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులను పరుగులు పెట్టించారు మోడీ. ఇటు ప్యాసింజర్, అటు సరుకు రవాణాకు ఎలాంటి ఆటంకం ఉండద్దని భావించి మూడో లైన్ వేయించారు. దీని వల్ల ట్రాన్స్ పోర్ట్ మరింత వేగంగా జరిగింది.

ఇక ‘వందే భారత్-ట్రైన్ 18’ పేరిట రైలును తీసుకువచ్చారు. తేలికపాటి హై స్పీడ్ రైలు అయిన ఇది ఎక్కువ వేగంతో దూసుకెళ్తుంది. ఇందులో ప్రయాణికులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను అమర్చారు. ఏసీతో పాటు కంఫర్ట్ సీట్స్ ఎక్కువ దూరం ప్రయాణించినా ఎలాంటి అలసటకు గురికాకుండా వసతులు కల్పించారు. ఇందులో తక్కువ దూరం ప్రయాణించే వారికి కూడా మరో ట్రైన్ ను తీసుకువస్తున్నారు. అదే వందే మెట్రో.

తక్కువ దూరం ప్రయాణికుల కోసం ‘వందే మెట్రో’ను తీసుకువస్తున్నారు. ఇది త్వరలో ట్రయల్ రన్ చేసుకుంటుందని అధికారులు చెప్తున్నారు. ‘వందే భారత్ మెట్రో’ అని కూడా దీన్ని పిలుస్తారు. వందే మెట్రో, సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నుంచి ప్రరణగా తక్కువ దూరాల ప్రయాణికుల కోసం తీసుకువస్తున్నారు. వందే మెట్రో అనేది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మాదిరిగానే స్వీయ చోదక రైలు. అంటే దీన్ని లాగేందుకు లోకోమోటివ్ అవసరం లేదు. వందే మెట్రో తయారీ వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (MEMU) రైళ్ల స్థానాన్ని భర్తీ చేయడంంతో పాటు ప్రయాణికులను వేగంగా గమ్య స్థానాలకు చేరుస్తుంది. ఫిబ్రవరి, 2023లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ‘వందే మెట్రో’ను ప్రకటించారు. ప్రస్తుతం కపుర్తలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (RCF), చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) ఒక్కో నమూనాను తీసుకువచ్చాయి. వీటిని ప్రస్తుతం పరీక్షిస్తున్నారు.

వందే మెట్రో వేగంగా స్పీడ్ అందుకుంటుంది. తక్కువ సమయంలోనే 130 kmph వరకు చేరుకుంటుంది. ఇది ప్రస్తుతం ఉన్న MEMU వేగం కంటే చాలా ఎక్కువ. వందే మెట్రోలో తేలికైన కుషన్ సీట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో కోచ్‌లో 100 నుంచి 200 మంది వరకు కూర్చునేలా సీట్లను అమర్చారు. లైట్ వేట్ కార్ బాడీ రైలు మొత్తం సామర్థ్యం, వేగానికి దోహదపడుతుంది.

వందే మెట్రోలో అన్నీ ఏసీ కోచ్‌లు ఉంటాయి. కొంచెం దూరమైనా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కోరుకునే ప్రయాణికులకు ఇది బెస్ట్ ఛాయిస్. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మాదిరిగానే కోచ్‌ల మధ్య లింకప్ ఉంటుంది. డోర్లు పూర్తిగా మూసి ఉండడంతో ధుమ్ము, ధూళి లాంటివి ఇందులోకి ప్రవేశించదు.

తేలికపాటి అల్యూమినియం లగేజ్ రాక్‌లు, LCD డిస్‌ప్లేలతో కూడిన ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ కలిగి ఉంటుంది. ప్రయాణికులు ఆటోమెటిక్ ఎంట్రీ, ఎగ్జిట్ డోర్లు, మొబైల్ ఛార్జింగ్ సాకెట్లు, డిఫ్యూజ్డ్ లైటింగ్, రూట్ ఇండికేటర్ డిస్‌ప్లే, రోలర్ బ్లైండ్‌లతో విశాలమైన పనోరమిక్ సీల్డ్ విండోలను అమరుస్తున్నారు.

భద్రతా కోణంలో పరిశీలిస్తే వందే మెట్రో రైళ్లు కవాచ్ రైలు యాంటీ-కొలిజన్ సిస్టమ్, CCTV కెమెరాలు, ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ యూనిట్లు, ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్, అలారం సిస్టమ్‌ను కలిగి ఉంటాయి. రైళ్లలో బయో-వాక్యూమ్ సిస్టమ్‌తో కూడిన మాడ్యులర్ టాయిలెట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ప్రతీ వందే మెట్రో రైలులో నిర్ధిష్ట మార్గం డిమాండ్‌ను బట్టి కోచ్‌ల సంఖ్య 12 లేదా 16 వరకు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. రైల్వే అధికారులు చెప్తున్న వివరాల ప్రకారం.. వందే మెట్రో రైళ్లు ఆగ్రా-మథుర, ఢిల్లీ-రేవారి, లక్నో-కాన్పూర్, తిరుపతి-చెన్నై, అండ్ భువనేశ్వర్-బాలాసోర్‌తో సహా వివిధ మార్గాల్లో నడపాలని భావిస్తున్నారు.`