Chenab Railway Bridge: ప్రపంచంలో ఎత్తయిన రైల్వే వంతెన.. త్వరలోనే అందుబాటులోకి…

జమ్మూకశ్మీర్‌లోని చినాబ్‌నదిపై భారత ప్రభుత్వం ఈ రైల్వే వంతెనను నిర్మించింది. కశ్మీర్‌ వెళ్లే పర్యాటకులు తప్పక చూడాల్సిన జాబితాలో ఈ వంతెను కూడా చేరనుంది.

Written By: Raj Shekar, Updated On : June 17, 2024 5:18 pm

Chenab Railway Bridge

Follow us on

Chenab Railway Bridge: ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెన ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే నిర్మాణం పూర్తయింది. త్వరలో ఈ వంతెన మీదుగా ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. మరి ఈ వంతెన ఎక్కడుంది.. దాని ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.

చినాబ్‌ నదిపై నిర్మాణ..
జమ్మూకశ్మీర్‌లోని చినాబ్‌నదిపై భారత ప్రభుత్వం ఈ రైల్వే వంతెనను నిర్మించింది. కశ్మీర్‌ వెళ్లే పర్యాటకులు తప్పక చూడాల్సిన జాబితాలో ఈ వంతెను కూడా చేరనుంది. ప్రపంచంలోనే ఎత్తయిన ఈ వంతెన నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. ఈ రైల్వే బ్రిడి మీదుగా రాంబన్‌ నుంచి. రియాసీకి అతి త్వరలో రైళ్లు నడవనున్నాయి. ఈమేరకు ఉత్తర రైల్వేశాఖ వెల్లడించింది.

అన్ని ప్రాంతాలను అనుసంధానించేలా..
కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు ఉధంపూర్‌ – శ్రీగర్‌ – బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చినాబ్‌ నదిపై ఈ వంతెన నిర్మించారు. ఇప్పటి వరకు చైనాలోని బెయిపాన్‌ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్‌ రైల్వే వంతెన పేరిట ఉన్న రికార్డును మన రైల్వే వంతెన అధిగమించింది. ప్రఖ్యాత ఐఫిల్‌ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండడం మరో విశేషం. నదీ గర్భం నుంచి 259 మీటర్ల ఎత్తున్న ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. ఇందులో భాగంగా కొన్ని టన్నెళ్లు కూడా నిర్మించారు.

ప్రయాణంతో ప్రత్యేక అనుభూతి..
అత్యంత ఎత్తయిన చినాబ్‌ వంతెనపై రైలులో ప్రయాణిస్తుంటే ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. ఇది ఆధునిక ప్రపంచలో ఒక ఇంజినీరింగ్‌ అద్భుతం. ఈ ట్రాక్, టన్నెళ్లు మహాద్భుతం. ప్రపంచంలో ఎనిమిదో వివంతగా అందరూ చెబుతున్నారు. ఈ వంతెనపై రైలు పరుగు మొదలైన రోజు రియాసీ జిల్లాకు ఒక గేమ్‌ చేంజర్‌ అవుతుందని పేర్కొంటున్నారు.