Anchor Deepika Pilli: ఒకప్పటి సోషల్ మీడియా సెలబ్రిటీ దీపికా పిల్లి కెరీర్ జోరందుకుంది. సినిమాలు, టెలివిజన్ షోస్లో ఆఫర్స్ పట్టేస్తూ దీపికా దూసుకుపోతున్నారు. టిక్ టాక్ స్టార్ గా దీపికా ఫుల్ ఫేమస్ అయ్యారు. తన క్యూట్ వీడియోలతో మిలియన్స్ లో ఫాలోవర్స్ ని సంపాదించారు. అయితే ఇండియాలో టిక్ టాక్ యాప్ బ్యాన్ చేశారు. ఈ పరిమాణం దీపికను దెబ్బతీసింది. అప్పటికే బాగా ఫేమస్ కావడంతో దీపికకు బుల్లితెర ఆఫర్స్ తలుపు తట్టాయి. ఏకంగా ఢీ షోలో యాంకరింగ్ చేసే ఛాన్స్ కొట్టేసింది.

తెలుగు పాప్యులర్ రియాలిటీ షోగా ఉన్న ఢీ సీజన్ 13 యాంకర్లో ఒకరిగా దీపికా ఉన్నారు. యాంకర్ రష్మీతో కలిసి ఢీ వేదికపై సందడి చేశారు. ఢీ షోలో రష్మితో సుడిగాలి సుధీర్ రొమాన్స్ చేస్తుంటే, దీపికా పిల్లిని హైపర్ ఆది సెట్ చేసుకున్నాడు. హైపర్ ఆది-దీపికా పిల్లి కాంబినేషన్ లో స్కిట్స్, రొమాంటిక్ సాంగ్స్ సెట్ చేశారు. వాటికి మంచి ఆదరణ దక్కింది. ఒక దశలో దీపికా పిల్లిని హైపర్ ఆది ప్రేమిస్తున్నాడు. త్వరలో పెళ్లి అంటూ పుకార్లు చక్కర్లు కొట్టాయి.
అనూహ్యంగా ఢీ 14 నుండి దీపికా పిల్లిని తొలగించారు. రష్మీ గౌతమ్, సుధీర్ లను కూడా పక్కన పెట్టిన విషయం తెలిసిందే. అయినప్పటికీ దీపికా పిల్లి పలు బుల్లితెర ఈవెంట్స్ లో కనిపించి సందడి చేస్తున్నారు. ఇటీవల ఆహాలో ‘కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్’ పేరుతో కామెడీ షో స్టార్ట్ అయ్యింది. సుడిగాలి సుధీర్ మేల్ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో దీపికా పిల్లి లేడీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

మరోవైపు ఆమెకు సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. సీనియర్ దర్శకుడు కే రాఘవేంద్రరావు పర్యవేక్షణలో విడుదలైన వాంటెడ్ పండుగాడ్ మూవీలో దీపికా పిల్లి నటించారు. ఆ చిత్రంలో దీపికా పిల్లితో పాటు అనసూయ, విష్ణుప్రియ వంటి యాంకర్స్ నటించారు. సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు.

ఇక సోషల్ మీడియాలో దీపికా పిల్లి తీరుకు కుర్రాళ్ళు బేజారు అవుతున్నారు. పొట్టి బట్టల్లో స్కిన్ షో చేస్తూ టెంపరేచర్ పెంచేస్తుంది. ఇటీవల మాల్దీవ్స్ కి వెళ్లిన దీపికా పిల్లి అందమైన సాగర తీరంలో పిచ్చగా ఎంజాయ్ చేశారు. బికినీలు ధరించి జలకాలు ఆడారు. ఎల్లో షార్ట్ ఫ్రాక్ ధరించి ఇసుకలో నాటీ ఫోజులిస్తూ ఒక ఫోటో షూట్ చేసింది. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.