Gangavva: గంగవ్వ ప్రస్తుతం ఓ సెలబ్రిటీగా మారిపోయింది. అరవైఏళ్ల వయసులో కూడా ఆమె నటిస్తూ అందరిని మెప్పిస్తోంది. తనకంటూ ఓ ఇమేజ్ ను సంపాదించుకుంది. దీంతో ఆమె ఎక్కడకు వెళ్లినా విపరీతమైన ఫాలోయింగ్ వస్తోంది. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. వయసు తేడా లేకుండా అందరు ఆమెతో సరదాగా మాట్లాడటంతో ఆమె ఎక్కడకు వెళ్లినా అక్కడ సందడే కనిపిస్తోంది. సహజమైన నటనతో అందరిని ఆకట్టుకుంటున్న గంగవ్వ యూ ట్యూబ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. దీంతో ఆమెకు పబ్లిక్ లో క్రేజ్ ఏర్పడింది.

గంగవ్వ మై విలేజ్ షో బృందంతో కలిసి నిర్మల్ జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంలోని లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లింది. దీంతో అందరు గుర్తుపట్టి గంగవ్వతో మాట్లాడేందుకు ఆసక్తి చూపించారు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఆమెతో మాట్లాడేందుకు ముందుకు రావడంతో ప్రజల్లో ఆమెకు ఉన్న క్రేజ్ అర్థమవుతోంది. తన నటనతోనే ఆమె ఇంత పాపులారిటీ సంపాదించుకున్నారు. బిగ్ బాస్ షో ద్వారా ఇంకా ఎక్కువ ప్రజాదరణ పొందినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ షోలో నాలుగు వారాలకు పైగా ఉండి తన స్థానాన్ని పదిలం చేసుకుంది. బిగ్ బాస్ షో ద్వారా గంగవ్వ మరోమారు పబ్లిక్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
Also Read: Sukumar Remunaration: పుష్ప తర్వాత సుకుమార్ ఒక్క సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా?
గంగవ్వను చూసిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. తమ ఆలయానికి దేవత వచ్చినట్లే ఉందని చెబుతూ గంగవ్వను పొగిడారు. మీరు మా ఊరికి రావడం మా అదృష్టమని ప్రశంసలు కురిపించారు. మై విలేజ్ షో దర్శక నిర్మాత శ్రీకాంత్ సోదరి కొడుకు కేశఖండనం కార్యక్రమానికి హాజరైన గంగవ్వకు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేయాల్సిన గంగవ్వ పబ్లిక్ తో సామాజిక మాధ్యమాలు, టీవీ షోల ద్వారా దగ్గరవుతోంది. దీంతో ఆమెకు ప్రజల్లో మరింత క్రేజ్ పెరుగుతోంది.

హీరో హీరోయిన్లకు ఉన్నంత ఫాలోయింగ్ గంగవ్వకు రావడం అభినందనీయమే. ఈ వయసులో కూడా ఆమె తన టాలెంట్ తోనే ప్రజల్లో పట్టు నిలుపుకుంటోంది. ఎక్కడకు వెళ్లినా ఆమెకు ఆదరాభిమానాలు దక్కుతున్నాయి. ఆమెలో ఉన్న సహజమైన నటనకు ఫిదా అవుతున్నారు. ఆమెపై అభిమానం చూపుతున్నారు. ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెడుతూ వైరల్ చేస్తున్నారు. భవష్యత్ తో కూడా గంగవ్వకు ఫాలోయింగ్ మరింత పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. దీంతో ఆమె ఓ స్టార్ గా ఎదుగుతున్నారనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గంగవ్వ మరిన్ని కార్యక్రమాల్లో తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తున్నారు.
Also Read:RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఆ చిన్న విషయాన్ని మీరు గుర్తించారా?