Homeట్రెండింగ్ న్యూస్Insect Rain in China: మొన్న బర్డ్‌ఫ్లూ.. నిన్న కరోనా.. నేడు పురుగు వాన.. దరిద్రాలన్నీ...

Insect Rain in China: మొన్న బర్డ్‌ఫ్లూ.. నిన్న కరోనా.. నేడు పురుగు వాన.. దరిద్రాలన్నీ చైనాలోనే..!

Insect Rain in China: దరిద్రం ఎలా ఉంటుందని అడిగితే.. ప్రస్తుతం చైనానే చూపించాలి. ఎందుకంటే ప్రపంచంలో ఏ ఉపద్రవమైనా మొదట చైనాలోనే జరుగుతుంది. ప్రమాదాలు కూడా ఘోరంగా ఉంటాయి. ఇక ప్రమాదకర వైరస్‌ల గురించి చేప్పాల్సిన పని లేదు. భయంకరమైన బర్డ్‌ఫ్లూ చైనాలోనే పుట్టింది. అక్కడి గబ్బిలాల నుంచే ఈ వైరస్‌ ప్రపంచంలోకి వచ్చింది. తర్వాత కరోనా… ఇది అక్కడి ల్యాబ్‌లో తయారు చేసి ప్రపంచాన్ని గజగజ వణికింది. లక్షల మంది ప్రాణాలు తీసింది. ఇప్పటికీ దాని ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా పురుగుల వాన.. ప్రపంచలో కొన్ని దేశాల్లో చేపలు, కప్పల వర్షం కురవడం చూశాం. కానీ చైనాలో ఘోరంగా ఇటీవల పురుగుల వాన కురిసింది. దీంతో చైనీయులే వణికిపోయారు.

చైనా గబ్బిలాల నుంచి బర్డ్‌ఫ్లూ..
బర్డ్‌ఫ్లూ ఇది మనుషులకు తక్కువగా సోకిన్పటికీ చాలా వరకు ప్రజలను భయపెట్టింది. కోళ్లు, పక్షులకు ఇదివేగంగా వ్యాప్తి చెందింది. మరి ఈ వైరస్‌ చైనాలోని గబ్బిలాల నుంచి పుట్టినట్లు సైంటిస్టులు గుర్తించారు. దీని నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్నారు.

ల్యాబ్‌లో తయారు చేసిన కరోనా..
కరోనా మహమ్మారిని చైనా ప్రపంచం మీదకు వదిలింది. చైనానే కరోనా వైరస్‌ను తయారు చేసిందని ప్రపంచ దేశాలకు చెందిన ఎన్నో ఏజెన్సీలు చెబుతూ ఉన్నాయి. కరోనా ఎక్కడ పుట్టిందనే వివరాలను తేల్చకపోతే కొవిడ్‌ 26, కొవిడ్‌ 32 ముప్పు కూడా ముంచుకొస్తుందని అమెరికా నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌ లోనే కరోనా వైరస్‌ తయారైందనడానికి ఎన్నో ఆధారాలున్నాయి. అది అబద్ధమని చెప్పే ఆధారాలను మాత్రం చైనా చూపించలేకపోయింది. దాని పుట్టుక గురించి తెలియకపోతే ప్రపంచానికి మరిన్ని ముప్పులు తప్పవని అన్నారు. గబ్బిలాలను తినడం వలన చైనాలో మనుషులకు కరోనా సంక్రమించిందని అంటున్నారు. అయితే శాస్త్రవేత్తలు, ఎపిడెమియాలజిస్టులు, వైరాలజిస్టులు, గబ్బిల జాతుల పరిశోధకులు హ్యూబెయ్‌ ప్రావిన్స్‌లో కరోనా పుట్టుకపై అధ్యయనం చేయించాలని సూచించారు. కరోనా పుట్టుకను కనిపెట్టకపోతే మానవాళికే ప్రమాదమని హెచ్చరించారు.

ఇప్పుడు మరో ఉపద్రవం..
ఓ వైపు కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతూ ఉంటే మరో ఉపద్రవాన్ని చైనా ప్రజల మీదకు తీసుకుని వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకూ బర్డ్‌ ఫ్లూ కేవలం పక్షుల్లో మాత్రమే ఉండగా.. ప్రపంచంలోనే తొలిసారి ఓ మనిషికి సోకింది. అది కూడా చైనాలోనే మనిషికి సోకింది. పక్షులకు మాత్రమే వ్యాపించే బర్డ్‌ ఫ్లూ మనుషులకు వ్యాపించేసింది. చైనాలో అదే చోటు చేసుకుంది. చైనాలోని తూర్పు ప్రావిన్స్‌లోని జెన్‌ జియాంగ్‌ నగరానికి చెందిన 41 ఏళ్ల ఓ వ్యక్తికి బర్డ్‌ ఫ్లూ సోకిందని ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్‌ ప్రకటించింది. వ్యాధుల గుర్తింపు నియంత్రణ (సీడీసీ) వారం రోజుల క్రితం అతడికి రక్త పరీక్షలు చేయగా బర్డ్‌ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని.. అతడిలో హెచ్‌10ఎన్‌3 స్ట్రెయిన్‌ వ్యాపించిందని చైనా వైద్యారోగ్య శాఖ తెలిపింది. బాధితుడికి అధికారులు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. అతడు ఇటీవల ఎవరెవరిని కలిశాడనే విషయంపై ఆరా తీస్తున్నారు. బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి తక్కువగా ఉంటుందని, దీనిపై ఆందోళన చెందాల్సిన పని లేదని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. అయితే ప్రపంచంలో ఇంతకు ముందెప్పుడూ మనిషికి బర్డ్‌ ఫ్లూ సోకింది లేదు.. ఇప్పుడు తొలిసారి మనుషులకు బర్డ్‌ ఫ్లూ సోకడమే ప్రపంచాన్ని టెన్షన్‌ పెడుతుంది.

పురుగుల వాన..
సాధారణంగా ఆకాశం నుంచి వర్షం కురవాలి కానీ అక్కడ పురుగులు కురుస్తున్నాయి.. గతంలో వడగళ్లు, రాళ్లు పడిన ఘటనల గురించి విన్నాం కానీ.. చైనాలో మాత్రం పురుగులు మీద పడిపోతున్నాయి. రోడ్లన్నీ పురుగులతోనే నిండిపోతున్నాయి. కరోనా తర్వాత చైనా అంటేనే దరిద్రాలకు అడ్డా అని ప్రపంచం చర్చించుకుంటున్న కాలమిది.. ఏదైనా వింత జరిగితే.. ఏదైనా ఊహించనది జరిగితే అది ముందుగా చైనాలోనే జరుగుతుందని జనాలు ఫిక్స్‌ ఐపోయారు. ఇప్పుడు ఆకాశం నుంచి పురుగుల వర్షం కురిసింది కూడా చైనాలోనే.

ఇలా ఎందుకు జరుగుతుంది?
బీజింగ్‌ రోడ్డుపై నిలిచిన కార్లపై ఆకాశం నుంచి వర్షంతో పాటు పెద్ద సంఖ్యలో పురుగులు పడినట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఇలా పడటానికి కొన్ని కారణాలను విశ్లేషిస్తున్నారు నిపుణులు. భారీ గాలులకు బురదలోని పురుగులు పైకి కొట్టుకెళ్లి వర్షంతో పాటు ఇలా పడి ఉంటాయని సైంటిఫిక్‌ జర్నల్‌ మదర్‌ నేచర్‌ నెట్వర్క్‌ తెలిపినట్లు చెప్పింది. తుపాను తర్వాత వీచే భారీ గాలుల్లో పురుగులు, కీటకాలు చిక్కుకున్నప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయని జర్నల్‌ చెబుతోంది. చైనాలో పురుగుల వర్షానికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతోంది.

ఇలాంటి ఉపద్రవాలను చూస్తుంటే చైనా ఇంకెన్ని ఉపద్రవాలను మనుషుల మీదకు తీసుకుని వస్తుందా అనే కలవరం అందరిలోనూ మొదలైంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular