Uttar Pradesh: రెండు జుట్లు కలిసి ఉంటాయి.. కానీ.. రెండు సిఖలు కలిసి ఉండవు అనేది నానుడి.. గతంలో వీధుల్లో నల్లాల వద్ద మహిళల సిగపట్ల దృశ్యాలు, బిందెలతో కొట్టుకునే ఫైట్లు కనిపించేవి. ఇళ్లు, వాకిలి, రోడ్డు అని చూడకుండా పొట్టు పొట్టు తన్నుకుంటారు. ఉన్న పరువును బజారున పడేసుకుంటారు. ఆ సమయంలో ఎవరున్నా అనవసరం. వీరి మధ్యకు వెళ్లిన వాళ్లు కూడా వీరి దాష్టీకానికి బలౌతుంటారు. ఇక ఇరుగింటి, పొరిగింటి సంగతి చెప్పనక్కర్లేదు. ఒక్కసారి ఇద్దరు ఆడవాళ్ల మధ్య చిచ్చు రేగిందా.. ఇక అంతే సంగతి.
వీటిని చూసే ఆ నానుడు వచ్చినట్లు ఉంది. అయితే ఇప్పుడు అలాంటి కొట్లాటలు చాలా వరకు తగ్గిపోయాయి. చాలా రోజుల తర్వాత మళ్లీ అలాంటి దృశ్యం ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అయితే ఇక్కడ మహిళలు కొట్టుకున్నది నీళ్ల కోసం కాదు.
యూపీలో ఘటన..
చిన్న విషయంలో మాటామాటా పెరిగి ఇద్దరు ఆడవాళ్లు రోడ్డుపై సిగ పట్టు పట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో జరిగింది. సచెండి పోలీస్ స్టేషన్ పరిధిలోని హృద్పూర్‌కు చెందిన ఇద్దరు మహిళలు.. ఇరుగు పొరుగున జీవిస్తున్నారు. అయితే ఓ విషయంపై వీరిద్దరి మధ్య తగాదా మొదలైంది. మాటామాట పెరిగి చేతల వరకు వచ్చాయి. ఇక రోడ్డు మీద ముష్టి యుద్ధం స్టార్ చేసేశారు. ఒంటిపై దుస్తులు ఊడిపోతున్నా పట్టించుకోకుండా.. జుట్లు పట్టుకుని రోడ్డుపై పడిపోయి మరీ దాడి చేసుకున్నారు. వీరిని విడిపించేందుకు ఓ పురుషుడు ప్రయత్నించినప్పటికీ.. మళ్లీ కొట్టుకున్నారు. మరికొంత మంది మహిళలు కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు.
ఇటీవలే మహిళా ఉపాధ్యాయులు..
ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోనే ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు కూడా ఇలాగే తన్నుకున్నారు. ఇగోకు పోయిన ఇద్దరూ.. పాత విషయాలను గుర్తుచేసుకుంటూ మరీ కొట్టుకున్నారు. కిందపడి దొర్లారు కూడా. విద్యాబుద్ధులు నేర్పాల్సిన వారే.. విద్యార్థుల ముందే కొట్టుకోవడం సంచలనంగా మారింది. తాజాగా ఇరుగు పొరుగు మహిళలు రోడ్డుపై సిగపట్టు పట్టారు. ఈ ఘటనలు చూస్తుంటే రెండు సిఖలు కలిసి ఉండవు అనే నానుడి నిజమే అనిపిస్తుంది.
— krishna veni (@krishna66577649) June 30, 2023