https://oktelugu.com/

Women Affair: భర్త కూలీ అని.. హెడ్ కానిస్టేబుల్ తో సంబంధం.. చివరికి..?

Women Affair:వివాహేతర సంబంధం ఎన్నిటికైనా చెడు మార్గాన్నే చూపుతుంది. కట్టుకున్న భర్తను కాదని వేరొకరితో హాయిగా ఉందామని వెళ్తున్న వారు ఎప్పుడు జీవితంలో సుఖంగా ఉండలేదన్నది నిత్యం సత్యం. ఇటీవల ఓ మహిళ తన భర్త చిన్న పనిచేస్తున్నాడని భావించి మరో వ్యక్తితో కలిసి వెళ్లింది. కానీ ఆ వ్యవహారం బెడిసి కొట్టడంతో చివరకు ప్రాణాలు తీసుకుంది. అయితే తన భార్య ప్రాణాలు తీసుకోవడానికి వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తే కారణమని భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 23, 2022 / 04:00 PM IST
    Follow us on

    Women Affair:వివాహేతర సంబంధం ఎన్నిటికైనా చెడు మార్గాన్నే చూపుతుంది. కట్టుకున్న భర్తను కాదని వేరొకరితో హాయిగా ఉందామని వెళ్తున్న వారు ఎప్పుడు జీవితంలో సుఖంగా ఉండలేదన్నది నిత్యం సత్యం. ఇటీవల ఓ మహిళ తన భర్త చిన్న పనిచేస్తున్నాడని భావించి మరో వ్యక్తితో కలిసి వెళ్లింది. కానీ ఆ వ్యవహారం బెడిసి కొట్టడంతో చివరకు ప్రాణాలు తీసుకుంది. అయితే తన భార్య ప్రాణాలు తీసుకోవడానికి వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తే కారణమని భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈవిషయంపై సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది.

     

    కర్ణాటకకు చెందిన రాజేశ్వరి, వెంకటేశ్ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయ్యాక కొన్నేళ్లపాటు వీరి సంసారం సజావుగా సాగింది. అయితే ఆ తరువాత రాజేశ్వరికి భర్త కూలీ పని చేస్తున్నాడని నామోషిగా ఫీలయింది. దీంతో తనకు పరిచయమైన హెడ్ కానిస్టేబుల్ అనంతకుమార్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. రాజేశ్వరి భర్తకు తెలియకుండా కాపురమే నడిపించ సాగింది. కొన్ని నెలల తరువాత ఈ విషయం భర్తకు తెలియడంతో హెచ్చరించాడు. మరోసారి ఇలాంటి సంబంధం పెట్టుకుంటే బాగుండదని వారించాడు.

    Also Read: హీరోయిన్ తో ఆ హీరోకు ఎఫైర్.. కేవలం తాత్కాలికమేనట?
    కానీ రాజేశ్వరి మాత్రం భర్త మాట వినకుండా అనంతకుమార్ తో చెట్టప్టాలేసుకొని తిరిగింది. అయితే ఆ తరువాత రాజేశ్వరి-అనంతకుమార్ ల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ పెద్దదిగా మారింది. దీంతో రాజేశ్వరి తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుంది. అయితే తన భార్య మరణానికి అనంతకుమార్ కారణమని రాజేశ్వరి భర్త పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనంతకుమార్ కోసం గాలిస్తున్నారు.

    అయితే అనంతకుమార్ పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నారు. ఈ వ్యవహరం తెలిసిన కొందరు భర్తతో సుఖంగా జీవించొచ్చుగా అని సలహాలు ఇస్తున్నారు. మరికొందరు వివాహేతర సంబంధం ఎన్నికైనా చెడు ప్రవసనాలకే దారితీస్తుందని అంటున్నారు. ఏదీ ఏమైనా ఈమధ్య ఇలాంటి వార్తలు బాగా వస్తున్నాయి. ఎన్ని సలహాలు చెబుతున్నా కొందరు అడ్డదారుల్లో వెళ్తూ ప్రాణాలను తీసుకుంటున్నారు.

    Also Read:శునకమే కనకం.. కుక్కను పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తున్న మహిళ