Viral News: ఆన్ లైన్ మోసాలకు అంతేలేదు. రోజుకో కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నా అప్రమత్తం కావడం లేదు. ఫలితంగా రూ. లక్షలు స్వాహా అవుతున్నాయి. ఉత్తపుణ్యానికి ఉన్నదంతా ఊడ్చిపెడుతూ ఘరానా మోసాలకు తెరతీస్తున్నారు. ఇప్పటికే పోలీసులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నా వినడం లేదు. అపరిచితులను నమ్మి లక్షలు దోచిపెడుతున్నారు. తాజాగా వినూత్న రీతిలో వృద్ధుడు మోసపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ యాభై ఏళ్లు దాటిన వ్యక్తి రెండో వివాహం కోసం ఓ మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించాడు. వారి నుంచి వివరాలు తీసుకున్న ఓ యువతి తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని అతడిని నమ్మించి స్నేహం చేయడం మొదలుపెట్టింది. అది కూడా సామాజిక మాధ్యమాల్లోనే. దీంతో సదరు వ్యక్తి ఉప్పొంగిపోయాడు. తనకు పెళ్లి అవుతుందని ఆశతో ఆమె చెప్పినట్లు తలాడించాడు.
Also Read: Malaika Arora: స్టార్ హీరో ఇంటి కోడలు చిన్న హీరోతో ఎఫైర్.. అసలు తప్పే లేదట !
ఈ నేపథ్యంలో ఆమె అతడితో ఇంకా చనువుగా మాట్లాడటం మొదలుపెట్టింది. తనకు కళాశాల ఫీజు కట్టాలని డబ్బులు కావాలని అడగటం మొదలుపెట్టింది. తరువాత కరోనా వచ్చిందని ఖర్చులకు డబ్బులు లేవని చెప్పడంతో యువతి ఖాతాలో డబ్బులు వేయడం చేసేవాడు. దీంతో కొద్ది రోజులు బాగానే సాగినా ఇక కథ క్లైమాక్సుకు వచ్చింది. ఇక మనం ఓసారి కలిసి మాట్లాడుకుందామని ఆ వృద్ధుడు కోరడంతో ఫోన్ స్విచాఫ్ చేసింది.

దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కూడా ఆ యువతిని పట్టుకునేందుకు అన్ని దారులు వెతుకుతున్నారు. దేశంలో ఎన్నో మోసాలు జరుగుతున్నా ఇంకా జాగ్రత్తగా ఉండకుండా మోసాలకు గురవుతున్నారు. రూ. 45 లక్షలు యువతి లాక్కోవడం చూస్తుంటే వృద్ధుడు అజాగ్రత్తగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మోసాలు అంత సులువుగా సాగుతుందనే విమర్శలు సైతం వస్తున్నాయి.
Also Read:Viral Video: నడిరోడ్డులో బైక్ పైనే ముద్దుాలా? రెచ్చిపోయిన ప్రేమికుల వైరల్ వీడియో