Homeబిజినెస్Tata cars sales: మార్కెట్లో దూసుకుపోతున్న TATA కార్లు.. ఒక్క నెలలో ఎన్నికార్లు అమ్మిందో తెలుసా..?

Tata cars sales: మార్కెట్లో దూసుకుపోతున్న TATA కార్లు.. ఒక్క నెలలో ఎన్నికార్లు అమ్మిందో తెలుసా..?

Tata cars sales: వినియోగదారుల అవసరానికి.. సౌకర్యవంతమైన కార్లను తీసుకురావడంలో TATA కంపెనీ ఎప్పుడూ టాప్ లెవల్ లో నిలుస్తూ ఉంటుంది. కొత్త ఏడాది 2026 సందర్భంగా ఈ కంపెనీ అద్భుతమైన అమ్మకాల మార్క్ ను సాధించింది. ఈ ఏడాది జనవరి అమ్మకాలను పరిశీలిస్తే ప్యాసింజర్ వాహనాల విక్రయాలలో 46% వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది. ఇది కంపెనీ చరిత్రలోనే రికార్డు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఏ ఒక్క నెలలో ఇంతలా విక్రాలు జరుపుకోలేదు. ఈ నెలలో […]

Tata cars sales: వినియోగదారుల అవసరానికి.. సౌకర్యవంతమైన కార్లను తీసుకురావడంలో TATA కంపెనీ ఎప్పుడూ టాప్ లెవల్ లో నిలుస్తూ ఉంటుంది. కొత్త ఏడాది 2026 సందర్భంగా ఈ కంపెనీ అద్భుతమైన అమ్మకాల మార్క్ ను సాధించింది. ఈ ఏడాది జనవరి అమ్మకాలను పరిశీలిస్తే ప్యాసింజర్ వాహనాల విక్రయాలలో 46% వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది. ఇది కంపెనీ చరిత్రలోనే రికార్డు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఏ ఒక్క నెలలో ఇంతలా విక్రాలు జరుపుకోలేదు. ఈ నెలలో మొత్తం 70,222 కార్లు వినియోగదారులకు అందించి విజేతగా నిలిచింది. అయితే అందుకు ఈ కంపెనీకి చెందిన మూడు కార్లు ప్రధానమని చెప్పవచ్చు. వీటిలో ఉండే ఫీచర్స్, ఇంజన్ పనితీరు వినియోగదారులను బాగా ఆకర్షించిందని తెలుస్తోంది.

అలాంటి కార్లలో మొదటిదిగా Nexon గురించి చెప్పుకోవచ్చు. ఈ ఒక్క నెలలో ఈ కారు 23,365 యూనిట్లు వివరాలు జరుపుకుంది. నెక్సాన్ పెట్రోల్, డీజిల్ తోపాటు ఎలక్ట్రిక్ వేరియంటు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ మూడు వేరియంటలో వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణంగా కారులను దక్కించుకున్నారు. మొత్తంగా 51 శాతం అమ్మకాలు ఈ కార్వి ఉండడం విశేషం. ఈ నమోదు తో ఈ కారు మొత్తం పది లక్షల విక్రయాలు జరుపుకోవడం విశేషం. నెక్సాన్ తర్వాత ఈ కంపెనీకి చెందిన పంచ్ కారు కూడా అత్యధిక విగ్రహాలు జరుపుకుంది. జనవరి నెల మొత్తంలో దీనిని 19,257 మంది దక్కించుకున్నారు. దీంతో దేశంలోనే టాప్ త్రీగా ఈ కారు నిలిచింది. ఇది ఎలక్ట్రిక్ వేరియెంట్లో ఉండడంతో చాలామంది దీనిని ఆదరించారు. దీంతో ఒక జనవరి నెలలోనే 18 శాతం అమ్మకాలు పెరిగాయి.

టాటా కంపెనీకి చెందిన టియాగో అమ్మకాలు సైతం జనవరిలో అత్యధికంగా నమోదు చేసుకున్నాయి. దీనిని 8,349 వినియోగదారులు కొనుగోలు చేశారు. హాచ్ బ్యాక్ విభాగంలో ఈ కారు మిగతా కారులకు గట్టి పోటీని ఇస్తూ ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఇదే కాకుండా టాటా కంపెనీకి చెందిన sieraa కారు కూడా కొత్త మోడల్ లో మార్కెట్లోకి వచ్చే వినియోగదారులకు ఆసక్తి రేగుతుంది. ఇది మార్కెట్లోకి వచ్చిన ఒక్కరోజులోనే 70 వేల బుకింగ్స్ నమోదు కావడం విశేషం. సాధారణంగా టాటా కంపెనీ SUV వేరియంట్ లో మాత్రమే నమ్మకమైన కార్లను తీసుకువస్తుందని అంటారు. కానీ అన్ని విభాగాల్లో ఈ కంపెనీ ఆకర్షినియమైన మోడల్స్ ను మార్కెట్లో ప్రవేశపెడుతోంది. ఇదేవిధంగా కార్లు విక్రయాలు జరుగుతే త్వరలోనే దేశంలో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించడం ఖాయం అని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper