Malaika Arora: కొందరి హీరోయిన్ల ప్రేమ బంధాలు మరీ విచిత్రంగా ఉంటాయి. పైగా పెళ్లి అయిపోయి, ఎదిగిన పిల్లలు ఉన్న ఓ ఇల్లాలు.. ఓ యంగ్ హీరోతో ప్రేమలో పడటం, అతని కోసం కుటుంబాన్నే వదిలిపెట్టడం వంటి వార్తలు వింటుంటే.. చలంగారి ‘మైదానం’ నవల గుర్తుకు వస్తుంది. సింహాసనం మీద కూర్చోబెడితే, గుమ్మం దగ్గర చెప్పుల రుచి మరిగితే.. ఎవరు మాత్రం ఏమి చేయగలరు. ఇంతకీ ఆ ఇల్లాలు ఎవరు అంటే.. బాలీవుడ్ ఐటమ్ హీరోయిన్ ‘మలైకా అరోరా’.

ఐటమ్ సాంగ్స్ చేసుకునే మలైకాకి కాలం కలిసి వచ్చి, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి కోడలు అయింది. పెద్ద ఇంటికి కోడలు అయినప్పటికీ, ఈ భామ మాత్రం తన బుద్ధిని మార్చుకోలేదు. పెద్ద కుటుంబం, పైగా హోదాకి హోదా.. అన్నిటినీ వదిలేసింది. అర్జున్ కపూర్ తో ప్రేమలో పడి చివరికి సల్మాన్ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. సల్మాన్ తమ్ముడికి హ్యాండ్ ఇచ్చి.. గత కొన్నేళ్లుగా అర్జున్ కి ప్రేమ పాఠాలు నేర్పుతుంది.
Also Read: Koratala Shiva: ‘ఎన్టీఆర్ హీరోయిన్’ పుకార్ల పై కొరటాల వివరణ.. ఫ్యాన్స్ కి ఇది షాకే
స్టార్ హీరో ఇంటి కోడలు అయ్యి ఉండి, ఇలా చిన్న హీరోతో తిరగడం.. సల్మాన్ ఖాన్ ఇంటి పరువు తీయడమే. మలైకా ప్రేమ వ్యవహారం బాలీవుడ్ లో ప్రకంపనలు క్రియేట్ చేస్తూనే ఉంది. ఇటు సల్మాన్ కుటుంబంతో పాటు అటు బోనీ కపూర్ కూడా తన తనయుడితో మలైకా ప్రేమ వ్యవహారంతో నలిగిపోతున్నాడు.

ఐతే ఎవరు ఎలా నలిగిపోతున్నా.. ఎంతగా బాధ పడుతున్నా.. మలైకా – అర్జున్ కపూర్ మాత్రం తమ ప్రేమలోనే మునిగితేలుతున్నారు. పెళ్లి కూడా చేసుకుని ఒక్కటి కావాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. ఐతే, తమ ఘాటు ప్రేమ బంధం పై తాజాగా కొత్త వివరణ ఇచ్చింది మలైకా అరోరా. తాజాగా ఓ ఆన్ లైన్ పోర్టల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలైకా మాట్లాడుతూ క్రేజీ కామెంట్స్ చేసింది.
ఆ కామెంట్స్ ఏమిటో ఆమె మాటల్లోనే విందాం. “ఒక స్త్రీ తన కంటే చిన్నవాడిని ఇష్టపడకూడదా ? తన కంటే చిన్నవాడితో రిలేషన్ లో ఉంటే ఎందుకు ఈ సొసైటీ రాద్దాంతం చేస్తోంది ? ఇందులో అస్సలు తప్పేముంది ? ఏ.. పెళ్లి అయినంత మాత్రానా.. ఇష్టాలను, కోరికలను చంపుకోవాలా ? నీకిష్టం వచ్చినట్లు నువ్వు బతుకు, నీకు ఏం చేయాలనిపిస్తే అది చేసేయ్ అని మా అమ్మ చెప్పేది. అందరూ ఇలాగే చేస్తే సంతోషంగా ఉంటారు’ అంటూ మలైకా అరోరా తనదైన భావాలను క్లుప్తంగా వివరించింది.

మలైకా గ్లామర్ కెరీర్ స్టార్ట్ అయి మూడు దశాబ్ధాలు పూర్తవుతున్నా.. మలైకా మాత్రం ఇంకా జిమ్ లు పబ్ లు చుట్టూ తిరుగుతూ టైం పాస్ చేస్తోంది. ఇది ఆమె అభిరుచి అని సరిపెట్టుకోలేం. అసలు మలైకా బరితెగింపుకి పోటీ ఇవ్వడానికి కూడా ఇప్పటి బోల్డ్ హీరోయిన్లు భయపడే పరిస్థితిలో ఉన్నారంటే ఈ ముదురు భామ ఎంతలా ముదిరిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ఆయితే మలైకాకి మాత్రం ప్రస్తుతం అవకాశాలేవీ లేవు.
Also Read: Minister Roja: మంత్రి రోజా మళ్లీ రావాలన్న జబర్దస్త్ టీం