Mother Killed Daughter: సృష్టిలో అమ్మతనం కంటే కమ్మదనం ఏదీ ఉండదు. అమ్మ లాలనలో అంతటి ప్రేమ ఉంటుంది. అందుకే మాతృదేవోభవ అంటారు. తల్లిని దేవతతో పోలుస్తాం. మనకు జన్మనిచ్చిన వారికి మనం ఎంత విలువ ఇస్తామో మన తరువాత తరం కూడా అలాగే చేస్తుంది. తల్లీబిడ్డల సంబంధం జన్మజన్మల అనుబంధం. ఎక్కడైనా చెడ్డ పిల్లలు ఉంటారు కానీ చెడ్డ తల్లి మాత్రం ఉండదు. కానీ ఇక్కడో కర్కోటకురాలు అభం శుభం తెలియని చిన్నారిని గొంతు నులిమి హత్య చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందనే ఉద్దేశంతో కన్న కూతురునే కడతేర్చిన తల్లి కథ వింటే హృదయ వదారకరమే. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన తల్లే యముడిగా మారి బిడ్డ ప్రాణం తీసింది.

విజయవాడకు చెందిన గురునాథం, దుర్గాభవాని భార్యాభర్తలు. వీరు బతుకు దెరువు కోసం నిజామాబాద్ కు వచ్చి పనులు చేసుకుంటూ ఉండేవారు. గురునాథం తాపీమేస్త్రీగా పనిచేసేవాడు. దీంతో భార్య ఆ వృత్తి వద్దని వారించడంతో ఆటో నడుపుకుంటూ భార్యాపిల్లలను పోషించేవాడు. వీరికి నాగలక్ష్మి(6), గీతా మాధవి(14 నెలలు) ఇద్దరు కూతుళ్లు. వీరి మధ్య మనస్పర్థలు పెరగడంతో గురునాథం ఇల్లు వదిలేసి విజయవాడ వెళ్లిపోయారు. అయినా వారి మధ్య గొడవలు సద్దుమణగలేదు. నిజామాబాద్ లో ఉంటున్న దుర్గాభవానికి బాన్సువాడ మండలం కొల్లూరుకు చెందిన శ్రీనుతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
దంపతుల మధ్య గొడవలు ముదరడంతో దుర్గాభవాని గత నెల 13న బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. కానీ ఆరా తీస్తే అక్కడకు చేరుకోలేదు. దీంతో భర్త గురునాథం విజయవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆమె నిజామాబాద్ లో ఉందని గుర్తించారు. దీంతో భర్త వెళ్లి చూడగా ఆమె దగ్గర చిన్న కూతురే ఉంది. పెద్ద పాప ఎక్కడని ప్రశ్నించగా ఆరోగ్యం బాగ లేకపోవడంతో బంధువుల ఇంట్లో ఉంచానని చెప్పింది. అయితే అక్కడకు పోదాం అని భర్త ఒత్తిడి చేయడంతో విషయం చెప్పింది.

బిడ్డను తామే చంపామని వివరించింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందనే ఉద్దేశంతో హత్య చేసినట్లు ఒప్పుకుంది. గురునాథం ఫిర్యాదు మేరకు దుర్గాభవాని, శ్రీనులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన సుఖం కోసం కన్న కూతురునే తుంచేసిన ఆమెపై మహిళలు శాపనార్థాలు పెట్టారు. ఇలాంటి తల్లి ఉండవద్దని అసహ్యించుకున్నారు. ఆరేళ్ల కూతురును అన్యాయంగా పొట్టన పెట్టుకున్న ఆ తల్లి మాతృత్వానికే మచ్చ తెచ్చింది. పేగుబంధం కోసం ఎన్నో కష్టాలు పడేవాళ్లను చూశాం కానీ తెంచుకునే తల్లిని ఏం చేసినా పాపం లేదని అందరు తిట్టిపోశారు.
Also Read:Chiranjeevi- Nagababu: చిరంజీవి, నాగబాబు అడ్డంగా దొరికిపోయారట.. ఏమిటా కథ?
https://www.youtube.com/watch?v=6AoeUJSSVKQ
