https://oktelugu.com/

Karimnagar : కడుపు తీయించుకున్న కోడలు.. ఆగ్రహంతో అత్త ఏం చేసిందో తెలుసా?

అమ్మలా లాలించే అత్త, కుతురులా మసులుకునే కోడలు ఉంటే ఆ ఇళ్లు ఒక బృందావనంలా ఉంటుంది. కుటుంబంలో కూడా ఎటువంటి అరమరికలు ఉండవు. అయితే ఇవి తెలియక చాలామంది ఇటువంటి ఘటనలతో వీధినపడుతున్నారు. 

Written By:
  • Dharma
  • , Updated On : June 15, 2023 7:15 pm
    Follow us on

    Karimnagar : అత్త అంటే అమ్మతో సమానమంటారు. అటువంటి అత్తే కోడలి తప్పుచేసిందని దాడిచేసింది. చీపురు, రాళ్లతో ఉతికి ఆరేసింది. పనిలో పనిగా ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ ను  సైతం బాదేసింది. పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇంతకీ కోడలు చేసిన తప్పేంటో తెలుసా? అబార్షన్ చేసుకోవడం. అయితే కోడలు మాత్రం తనకు రక్తస్రావం జరుగుతోందని వైద్యురాలి వద్దకు వచ్చానని.. తన తప్పు ఏమీ లేదని చెప్పుకొస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

    కరీంనగర్ కు చెందిన ఓ యువతి వైద్యసేవల కోసం తల్లితో కలిసి ఆస్పత్రికి వెళ్లింది. వైద్య పరీక్షలు చేస్తుండగా సదరు యువతి అత్తమామలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. కోడలిని ఆస్పత్రి బయటకు తెచ్చి చీపురు, రాళ్లతో దాడిచేశారు. ఈ ఘటనతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. సముదాయించే ప్రయత్నం చేశారు. ఇంతలో అక్కడకు చేరుకున్న వైద్యురాలిపై దాడిచేశారు. చేతికి దొరికిన వాటితో కొట్టడం ప్రారంభించారు. సదరు డాక్డర్ పోలీసులకు ఫిర్యాదుచేస్తామనడంతో మరింత డోసు పెంచారు. అయితే అక్కడున్న వారు వీడియోలను చిత్రీకరించారు. సోషల్ మీడియాలో పెట్టడంతో క్షణాల్లో వైరల్ అయ్యాయి.

    పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఘటనపై ఆరాతీశారు. ఎందుకు దాడిచేశారని అత్తమామలను ప్రశ్నించారు. తమ కోడలు మూడు నెలల గర్భిణీ అని.. తమకు తెలియకుండా అబార్షన్ చేయించుకుందాని వారు కన్నీరుమున్నీరవుతూ చెప్పారు. కోడలిని ప్రశ్నిస్తే తనకు రక్తస్రావం కావడంతో డాక్టర్ వద్దకు వచ్చానని చెబుతోంది. దీంతో అటు అత్తమామలు, కోడలిని సముదాయించిన పోలీసులు అక్కడ నుంచి పంపించేశారు. దీంతో వివాదానికి కాస్తా ఫుల్ స్టాప్ పడింది.

    అత్తా కోడళ్ల మధ్య నిత్యం తగదాలు కామన్ గా జరుగుతుంటాయి. కోడళ్లను మానసికంగా వేధించే అత్తలు, ముదిమి వయసులో అత్తలకు ఆపసోపాలకు గురిచేసే కోడళ్లు తారసపడుతుంటారు. అయితే అందర్నీ ఒకే గాటిన కట్టేయ్యలేము. తల్లీ కూతుళ్ల మాదిరిగా వ్యవహరించే అత్తా కోడళ్లు కూడా ఉంటారు. అమ్మలా లాలించే అత్త, కుతురులా మసులుకునే కోడలు ఉంటే ఆ ఇళ్లు ఒక బృందావనంలా ఉంటుంది. కుటుంబంలో కూడా ఎటువంటి అరమరికలు ఉండవు. అయితే ఇవి తెలియక చాలామంది ఇటువంటి ఘటనలతో వీధినపడుతున్నారు.