Annamalai : భయంతో ‘సిబిఐ పరిధి’ని ఉపసంహరించిన తమిళనాడు ప్రభుత్వం

ఆర్టీసీ ఉద్యోగులను డబ్బులకు అమ్ముకుంటే మంత్రిపై చర్యలు తీసుకోని హైకోర్టుపై సుప్రీంకోర్టు మొట్టికాయ వేసింది. ఆరోజు లేనిది ఇదే మాట్లాడిన అన్నామలైను తప్పు పడుతూ డీఎంకే ప్రభుత్వం తీర్మానం చేయడం వివాదాస్పదమైంది.

Written By: NARESH, Updated On : June 15, 2023 7:21 pm
Follow us on

Annamalai : అన్నామలై ఏం చెప్పాడో అదే జరిగింది. అన్నామలైకి వ్యతిరేకంగా అన్నాడీఎంకే తీర్మానమే చేసింది. అన్నామలై అన్నది ఏంటి? పత్రికా విలేకరులు అడిగిన దానికి సమాధానం చెప్పాడు. పేరు కూడా చెప్పలేదు. అయినా కూడా అన్నామలైకి వ్యతిరేకంగా స్టాలిన్ ప్రభుత్వం ఒక తీర్మానం చేయడం గమనార్హం.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయాడు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే అతడి కొడుకు, అల్లుడు 30 వేల కోట్లు నొక్కేశారని ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా పెద్ద సంచలనం.. దీన్ని బయట పెట్టింది తమిళ నాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలై. అది కూడా స్టాలిన్ అల్లుడు ఒక ప్రైవేట్ పార్టీలో అన్న మాటలను అన్నామలై సోషల్ మీడియాలో బయట పెట్టేశాడు. దాన్ని ఇప్పుడు కడుక్కోలేక స్టాలిన్ కింద మీదా పడుతున్నాడు.

స్టాలిన్ ప్రభుత్వంలో ఇవాళ కూడా అవినీతి జరుగుతోంది. డీఎంకే ప్రభుత్వం ట్రాన్స్ పోర్ట్ మంత్రిగా ఉండి డ్రైవర్లు, కండక్టర్ల జాబుల కోసం డబ్బులిస్తే పోస్టులు ఇచ్చాడని అన్నామలై బయటపెట్టారు. ఇది నిరూపితం కావడంతో ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు. డబ్బులు ఇచ్చినా కూడా మంత్రి ఉద్యోగాలు ఇవ్వలేదని ధర్నాలు కూడా జరిగాయి. మంత్రిపై ఫిర్యాదులు చేశారు.

ఆర్టీసీ ఉద్యోగులను డబ్బులకు అమ్ముకుంటే మంత్రిపై చర్యలు తీసుకోని హైకోర్టుపై సుప్రీంకోర్టు మొట్టికాయ వేసింది. ఆరోజు లేనిది ఇదే మాట్లాడిన అన్నామలైను తప్పు పడుతూ డీఎంకే ప్రభుత్వం తీర్మానం చేయడం వివాదాస్పదమైంది.

తమిళనాడు ప్రభుత్వంపై పోరాడుతున్న అన్నామలైపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..