Extra Marital Affair Warangal: వివాహేతర సంబంధాలు విచ్చలవిడిగా మారుతున్నాయి. దీంతో ప్రాణాల మీదకు వస్తోంది. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న హత్యల్లో అయితే భూతగాదాలు లేకపోతే వివాహేతర సంబంధాలతో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా కొనసాగుతున్నాయి. రోజురోజుకు విచ్చలవిడితనం విపరీతంగా పెరుగుతోంది. శృంగారంపై అందరికి మక్కువ పెరుగుతోంది. కాకపోతే జీవిత భాగస్వామితో కాకుండా ఇతరులపై మోజు పెంచుకుంటున్నారు. ఫలితంగా విలువైన ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు.

వరంగల్ లోని 15వ డివిజన్ లో వనిత అనే మహిళ తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె గొర్రెగుంటలోని పశువుల ఆస్పత్రిలో వెటర్నరీ వైద్యురాలిగా పనిచేస్తోంది. ఆమెకు గతంలోనే వివాహం జరిగింది. మున్సిపల్ కార్యాలయంలో వర్క్ ఇన్ స్పెక్టర్ గా పనిచేసే ప్రభాకర్, వనిత పరస్పరం ప్రేమించుకున్నారు. అనంతరం పెళ్లి చేసుకున్నారు. ప్రభాకర్ కు అనారోగ్యం దరిచేరడంతో ఆరు నెలల క్రితం చనిపోయాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఓ కొడుకు ఉన్నారు. ప్రభాకర్ చనిపోవడంతో వనిత ఇంకొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
కొంత కాలం వరకు బాగానే ఉన్నా ఇటీవల వీరి మధ్య మనస్పర్దలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇరువురు విడిపోయినట్లు తెలుస్తోంది. వనిత మాత్రం అతడిపైనే ధ్యాస పెట్టుకుంది. అతడు దూరం కావడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఎడబాటును ఏదో శాపంగా భావించింది. జీవితంలో తనకు తోడు ఎవరు లేనప్పుడు నేనెందుకు బతకాలని అనుకుంది. అనుకున్నదే తడవుగా తనువు చాలించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆత్మహత్యకు పాల్పడింది. ముగ్గురు పిల్లలను మాత్రం అనాథలను చేసింది. ఇప్పుడు పిల్లలకెవరు దిక్కు అనే ప్రశ్న వస్తోంది.

వనిత తన మొబైల్ లో ఐ మిస్ యూ అని సందేశం పెట్టడంతో వివాహేతర సంబంధమే కారణమనే వాదనలు వస్తున్నాయి. ఆరు నెలల క్రితం తండ్రి, ఇప్పుడు తల్లి దూరం కావడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. వివాహేతర సంబంధం ఎన్ని వివాదాలకు కారణమవుతుందో తెలుస్తూనే ఉంది. ముక్కుపచ్చలారని బిడ్డలు మాత్రం ఒంటరి వారు కావడం గమనార్హం. ఇప్పుడు వారి ఆలనాపాలన ఎవరి బాధ్యత. వనిత చేసిన దానికి ఆమె సంతానం దిక్కులేని వారు కావడంతో వారిని చేరదీసే వారెవరు? వారిని దగ్గరకు తీసేది ఎవరు? అనే ప్రశ్నలు అందరిలో వస్తున్నాయి.
