Union Budget 2023-24: ప్రతిఏటా ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో… దేశ ప్రజలు మొత్తం ఆసక్తిగా గమనించేది… ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి?. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి అని… అయితే ఈసారి బడ్జెట్ ను 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల ప్రకటించారు.. స్థూలంగా చెప్పాలంటే మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. వచ్చే ఏడాది ఎన్నికలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం మద్యంతర బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడుతుంది.. అయితే ఈసారి నిర్మల సీతారామన్ మధ్యతరగతి జీవులను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపొందించినట్టు కనిపిస్తోంది.. ఇందులో భాగంగానే అడగకుండానే వరాలు ఇచ్చారు.. ముఖ్యంగా పన్ను శ్లాబ్ లను సరళతరం చేశారు.. దీనివల్ల కొన్ని వస్తువులు ఖరీదయ్యాయి.. కొన్ని వస్తువులు చౌకగా మారాయి..

స్వావలంబన భారతదేశాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈసారి కస్టమ్స్ సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది.. ఫలితంగా చాలా వస్తువుల ధరలు ఖరీదయ్యాయి.. అదే సమయంలో కొన్ని వస్తువులు ధరలు తగ్గు ముఖం పట్టాయి.. బొమ్మలు, సైకిళ్ళు చౌకగా మారతాయి.. 13 శాతానికి కస్టమ్స్ సుంకాన్ని పెంచడం వల్ల ప్రైవేట్ జెట్ లు, హెలికాప్టర్లు, ఖరీదైన ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్ వస్తువులు, ఆభరణాలు, హై గ్లోస్ పేపర్, స్టీల్ ఉత్పత్తులు, ఆభరణాలు, లెదర్, విటమిన్ సంబంధిత మాత్రల ధరలు పెరుగుతాయి..
Also Read: Income Tax In Budget 2023: కేంద్ర బడ్జెట్ : వేతన జీవులకు ఊరట.. ఆయాచిత వరం ఇచ్చిన నిర్మల
ఇదే సమయంలో రత్నాలు, అభరణాల రంగానికి సంబంధించి బంగారం మరికొన్ని వస్తువులపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆర్థిక శాఖ మంత్రికి సూచించింది.. దీని ప్రకారం ఖజానాకు లోటు రాకుండా కేంద్రం నిర్ణయం తీసుకుంది.. గత ఏడాది బడ్జెట్ లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 నుంచి 15 శాతానికి ప్రభుత్వం పెంచింది.. ఏవియేషన్, ఎలక్ట్రానిక్స్, స్టీల్, ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలలో కస్టమ్స్ సుంకాలను ప్రభుత్వం రద్దు చేసింది.
ఇవి చౌక
బొమ్మలు, సైకిళ్లు, టీవీ, మొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రయోగశాలలో తయారుచేసిన వజ్రాలు, బయోగ్యాస్ సంబంధిత వస్తువులు, కెమెరా లెన్స్ లు, ఆటోమొబైల్స్, ఎల్ఈడి టీవీలు.
ఇవీ ఖరీదైనవి
బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినం, దేశీ కిచెన్ చిమ్నీ, విదేశాల నుంచి వెండితో తయారుచేసిన ఆరు ఖరీదైన వస్తువులు, సిగరెట్లు, దిగుమతి చేసుకున్న తలుపులు.

మరోవైపు స్వావలంబన దేశంగా మార్చే ప్రక్రియలో ప్రభుత్వం ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసేందుకు కస్టమ్ సుంకాలను పెంచుతోంది. దీనివల్ల స్వదేశంలో తయారీ విధానం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది..మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా దేశంలో ఇప్పుడు ఎన్నో వస్తువులు తయారవుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.. రక్షణ రంగంలో కూడా ఆయుధాలను తయారు చేసి మనం ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని ఆమె పేర్కొన్నారు.. ఇదంతా కూడా మేక్ ఇన్ ఇండియా పథకం చలవే అని ఆమె ఉద్ఘాటించారు.
Also Read: Union Budget 2023 Highlights: కేంద్ర బడ్జెట్- 2023లోని ముఖ్యాంశాలు ఇవీ.. ఏ రంగానికి ఎంతంటే?
