Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపు ను సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… ప్రస్తుతం పాన్ ఇండియాలో అతన్ని మించిన దర్శకుడు మరొకరు లేరనెంతలా పేరు ప్రఖ్యాతలనైతే సంపాదించుకున్నాడు. ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియాలో రిలీజ్ అయిన అన్ని సినిమాల కంటే పుష్ప 2 సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేసి అత్యధిక కలెక్షన్స్ ను సాధించిన సినిమాగా నిలిచింది. ఇక ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ రీతిలో ఆయన తన పంథాను మార్చుకుంటూ ముందుకు సాగుతున్నాడు. సినిమా సినిమాకి తన స్టార్ డమ్ ను పెంచుకుంటున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం రామ్ చరణ్ తో చేయబోయే సినిమా విషయంలో కూడా చాలా క్లారిటీ గా ఉన్నాడు…సుకుమార్ దగ్గర పని చేసిన శిష్యులు ఇండస్ట్రీ కి పరిచయమవుతున్నారు అంటే వాళ్ల మీద చాలా మంచి అంచనాలైతే ఉన్నాయి.
ఇప్పటికే బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకులు సైతం టాప్ డైరెక్టర్ గా మారారు. మొదటి సినిమాతోనే వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి ఇండస్ట్రీలో వాళ్ళకి చాలా మంచి ఆదరణ దక్కుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే లెనిన్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన అఖిల్ ను హీరోగా పెట్టి సుకుమార్ తన శిష్యుడితో ఒక సినిమా చేయిస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇప్పటికే కథా చర్చలను జరుపుతున్న సుకుమార్ మొత్తానికైతే ఈ సినిమాని ఫైనల్ చేసి సుకుమార్ రైటింగ్స్ లోనే ఈ సినిమాని తెరకెక్కించే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. గతంలో సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ‘100% లవ్’ అనే సినిమా వచ్చింది. కాబట్టి అక్కినేని ఫ్యామిలీతో తనకు చాలా మంచి సంబంధాలైతే ఉన్నాయి. అఖిల్ తో కూడా తను సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
మొత్తానికైతే ప్రస్తుతం తను డైరెక్షన్ చేయకపోయిన కూడా తన శిష్యుడితో డైరెక్షన్ చేయిస్తూ తన రైటింగ్స్ లో సినిమా రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. మొత్తానికైతే సుకుమార్ తను అనుకున్న విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దగలుగుతాడా? అఖిల్ కి భారీ సక్సెస్ ని కట్టబెడతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
