Second Saturday: రెండో శనివారం సెలవు ఎందుకు.. ఎప్పటి నుంచి ప్రారంభమైంది?

19వ శతాబ్దంలో ఓ బ్రిటిష్‌ ఆఫీసర్‌ దగ్గర చాలా నిజాయతీగా పనిచేసే సహాయకుడు ఉండేవాడట. అతను సెలవుదినాల్లో మాత్రమే తల్లిదండ్రులను కలవడానికి వెళ్లేవాడు.

Written By: Raj Shekar, Updated On : February 3, 2024 9:55 am
Follow us on

Second Saturday: సెకండ్‌ శాటర్‌డే.. ఇది పిల్లలకు బాగా తెలుసు. దేశంలోని కొన్ని శాఖల వారికీ తెలుసు. ఎందుకంటే వారికి సెలవు ఉంటుంది. చాలా మంది దీనిని ఎంజాయ్‌ చేస్తారు. సెకండ్‌ శాటర్‌డే, సండే హాలిడే కోసం ఎదురు చూస్తుంటారు. ఇందుకోసం ఎదురు చూస్తుంటారు. అయితే.. సెలవు తీసుకునేవారికి కూడా ఎందుకు సెలవు ఇస్తున్నారు అనే విషయం తెలియదు. కానీ, సెకండ్‌ శాటర్‌డే సెలవు వెనుక ఆసక్తికరమైన స్టోరీ ఉంది.

సెలవు ఎందుకో తెలుసా?
19వ శతాబ్దంలో ఓ బ్రిటిష్‌ ఆఫీసర్‌ దగ్గర చాలా నిజాయతీగా పనిచేసే సహాయకుడు ఉండేవాడట. అతను సెలవుదినాల్లో మాత్రమే తల్లిదండ్రులను కలవడానికి వెళ్లేవాడు. అలా కొన్నేళ్లు గడిచింది. రోజులతోపాటు బాధ్యతలు కూడా పెరిగాయి. సెలవులు తగ్గిపోయాయి. ఈ క్రమంలో అతను తల్లిదండ్రుల వద్దకు వెళ్లలేకపోయేవాడు. దీంతో తల్లిదండ్రులే కొడుకు వద్దకు రావడం ప్రారంభించారు. ఒకరోజు తమ కొడుకుకి సెలవు ఇచ్చి తమతో పంపమని అడగటానికి బ్రిటిష్‌ అధికారి వద్దకు వెళ్లారట.

విషయం తెలుసుకుని..
తన వద్ద పనిచేసే సహాయకుడికి తల్లిదండ్రులను కలిసే సమయం కూడా దొరకడం లేదన్న విషయం అప్పుడు తెలుసుకున్నాడు సదరు అధికారి. తనవద్ద నిజాయతీ, నిబద్ధతతో పనిచేస్తున్న సహాయకుడిని అతను మెచ్చుకున్నాడు. నెలకోసారి తల్లిదండ్రులను కలిసేందు వీలుగా ప్రతీనెల రెండో శనివారం కూడా అతనికి సెలవు ఇచ్చాట. దీంతో రెండు రోజులు అతను తల్లిదండ్రుల వద్దకు వెళ్లే వీలు కలిగింది. తర్వాత దానిని బ్రిటిష్‌ ప్రభుత్వం అధికారికంగా సెకండ్‌ శాటర్‌డేను సెలవు దినంగా ప్రకటించింది. స్వాతంత్య్రం తర్వాత భారత ప్రభుత్వం కూడా వర్క్‌ బర్డెన్‌ ఎక్కువగా ఉండే కొన్ని ప్రధానమైన విభాగాల్లో ఈ సెలవును అమలు చేస్తోంది.