https://oktelugu.com/

Petrol And CNG Cars : పెట్రోల్, CNG ల బెస్ట్ కార్లు ఇవే.. ధర కూడా తక్కువే..

కొందరు వినియోగదారులు పెట్రోల్ ఇంజిన్ తో పాటు CNG ఉన్న కార్లనే కొనాలని చూస్తున్నారు. వీరి కోసం చాలా కంపెనీలు...

Written By:
  • Srinivas
  • , Updated On : February 3, 2024 / 09:45 AM IST

    Petrol and CNG best cars

    Follow us on

    Petrol, CNG Cars : కాలం మారుతున్న కొద్దీ వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయి. ఒకప్పుడు కారు ఉంటే చాలు అనుకునేవారు. కానీ ఇప్పుడు సౌకర్యవంతంగా ఉండే వెహికల్ కోసం చూస్తున్నారు. మార్కెట్లో కంపెనీల మధ్య పోటీ ఏర్పడడంతో వినియోగదారులకు అనుగుణంగా కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. కొందరు వినియోగదారులు పెట్రోల్ ఇంజిన్ తో పాటు CNG ఉన్న కార్లనే కొనాలని చూస్తున్నారు. వీరి కోసం చాలా కంపెనీలు ఇప్పటికే రెండు వేరియంట్లు ఉన్న కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి.అయితే ఇలా రెండు రకాల సౌకర్యాలున్నా బెస్ట్ కార్లు ఏవో తెలుసుకుందాం..

    దేశంలో కార్ల ఉత్పత్తిలో మారుతి సుజుకీ అగ్రగామిలో నిలుస్తుంది. ఈ కంపెనీ నుంచి వివిధ వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చిన కార్లు ఆకర్షిస్తున్నాయి. పెట్రోల్ తో పాటు CNG కలిగి కార్లు మారుతి ఇప్పటికే రోడ్లపై తిప్పుతోంది. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిని ఉన్నాయి. ముందుగా మారుతి ఎర్టీగా గురించి చెప్పుకోవచ్చు. మారుతి ఎర్టీగా 7 సీటర్ తో అలరిస్తుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉ:ది. ఇది లీటర్ కు 20.51 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. CNG వేరియంట్ లో 88 బీహెచ్ పీ పవర్, 121.5 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్ జీలో ఇది 26.11 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది రూ.8.69 లక్షల ప్రారంభ ధర ఉండగా టాప్ ఎండ్ 13.3 లక్షలతో విక్రయిస్తున్నారు.

    మారుతి నుంచి బెస్ట్ కారు స్విప్ట్ అని అందరికీ తెలిసిందే. ఈ మోడల్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 90 బీహెచ్ పీ పవర్, 113 ఎన్ ఎం టార్క్ తో కలిగి ఉంది. CNG వేరియంట్ లో 77.5 బీహెచ్ పీ పవర్, 98.5 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంది. ఈ మోడల్ పెట్రోల్ వేరియంట్ లో 22.38 కిలోమీట్లు, సీఎన్ జీ 30.90 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. స్విప్ట్ రూ.5.99 లక్షల ఎక్స్ షోరూం ధర ఉంది.

    మారుతి కంపెనీకి చెందిన మరో మోడల్ బ్రెజ్జా సైతం రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 103 బీహెచ్ పీ పవర్, 137 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్ జీ 88 బీహెచ్ ప పవర్, 121.5 ఎన్ ఎం టార్క్ ను కలిగి ఉంది. పెట్రోల్ వేరయింట్ 17.38 కిలో మీట్ల మైలేజ్ ఇస్తుండగా.. సీఎంజీ 25.51 కిలోమీటర్లతో దూసుకుపోతుంది. ఈ మోడల్ 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. బ్రెజ్జా ను రూ.8.29 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

    మారుతికి గట్టి పోటీ ఇస్తున్న టాటా నుంచి పంచ్ రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో 88 బీహెచ్ పీ పవర్, 115 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్ జీ 73.5 బీహెచ్ పీ పవర్, 103 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వేరియంట్ లో టాటా పంచ్ 18.8 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా.. సీఎన్ జీలో 26.99 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. పంచ్ లో 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ సౌకర్యాలు ఉన్నాయి. టాటా పంచ్ రూ.6 లక్షల నుంచి విక్రయిస్తున్నారు.