Surya And Vikram: తమిళ్ హీరోలైన సూర్య, విక్రమ్ మధ్య జరిగిన గొడవ ఏంటో తెలుసా..?

ప్రస్తుతం ఇద్దరు వైవిధ్యమైన సినిమాలను చేయడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటున్నారు. ఇక ఇలాంటి సూర్య, విక్రమ్ కి మధ్య ఒక విషయంలో గొడవ జరిగిందనే విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.

Written By: Gopi, Updated On : February 3, 2024 10:02 am

Surya And Vikram

Follow us on

Surya And Vikram: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు గా గుర్తింపు పొందిన సూర్య, విక్రమ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే వాళ్లు తమిళం లో ఎంత పెద్ద స్టార్ హీరోలు గా ఎదిగారో అలాగే తెలుగులో కూడా మంచి మార్కెట్ ని సంపాదించుకున్నారు. ఇక వీళ్ళిద్దరూ కలిసి శివ పుత్రుడు అనే సినిమాతో ఒకేసారి తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత ఇద్దరు సపరేట్ గా సినిమాలు చేస్తూ వాటిని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. దాంతో ఇక్కడ కూడా వాళ్ల సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

ఇక ప్రస్తుతం ఇద్దరు వైవిధ్యమైన సినిమాలను చేయడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటున్నారు. ఇక ఇలాంటి సూర్య, విక్రమ్ కి మధ్య ఒక విషయంలో గొడవ జరిగిందనే విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. శివపుత్రుడు సినిమా దర్శకుడు అయిన బాలా, ఆ సినిమా తర్వాత వీళ్లిద్దరిని పెట్టి మరోక మల్టీ స్టారర్ సినిమా చేద్దామని అనుకున్నాడట. కానీ కొన్ని కారణాలవల్ల ఆ సినిమా అనేది సెట్స్ పైకి రాలేదు. ఇక ఇలాంటి క్రమంలోనే సూర్యకి, విక్రమ్ కి మధ్య చిన్న గొడవ జరిగిందని అప్పట్లో కోలీవుడ్ మీడియా అనేక కథనాలను ప్రచురించింది. అయితే బాలా సూర్యకి ఇస్తానన్న క్యారెక్టర్ విక్రమ్ నాకు కావాలని అడిగారంట దాంతో సూర్య , విక్రమ్ మధ్య చిన్న క్లాషేష్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది.

ఇక దాంతో బాలా ఆ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లకుండా ఆపేశాడు. ఇక అప్పటి నుంచి సూర్య, విక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క మల్టీస్టారర్ సినిమా కూడా రాలేదు. కానీ ఇద్దరూ ఎవరికి వారు మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే సూర్య తెలుగులో యముడు, సింగం, జై భీమ్ లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు.

అలాగే విక్రమ్ కూడా అపరిచితుడు, ఐ, నాన్న లాంటి సినిమాలతో మంచి సక్సెస్ లను సాధించాడు. ఇక మొత్తానికైతే వీళ్ళిద్దరూ మంచి నటులుగా కూడా గుర్తింపు పొందారు.ఇక వీళ్ళ కాంబో లో మల్టీ స్టారర్ సినిమా వస్తే చూడటానికి ప్రేక్షకులు రెఢీ గా ఉన్నారు. మరీ ఫ్యూచర్ లో వీళ్ళ కాంబో లో సినిమా వస్తుందో లేదో చూడాలి…